
పెద్ద నోట్ల రద్ద తర్వాత కేంద్రం షాకుల మీద షాక్ ఇస్తుంది. ఇకపై రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మీదగ్గర ఉంటే నేరం చేసినట్లే.
దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
ఇకపై రూ. పదివేలకు మించి పాత పెద్ద నోట్లు ఉంటే అది క్రైం కిందకు వస్తుంది.
అలా 10 వేలకు మించి ఎవరి దగ్గరైనా దొరికితే భారీ జరిమానా విధించే అవకాశం లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకరావడానికి కేంద్రం సిద్ధమవుతోంది.