
తెలుగు రాష్ట్రాలలో రాఖీ రాజకీయ సంచలనం మొదలయింది. తెలివైన నిజాంబాద్ ఎంపి కవిత, తన సోదరుడు మంత్రి కెటిఆర్ రాఖీ కట్టారు. ఇది ఆమె పోయిన తూరి కూడా చేశారు.ఈ సారి ఆమె రాఖీకి సందేశం జోడించారు. రాఖీని చెల్లెళ్లందరు అన్నలకు కట్టడమే కాదు, అన్న భద్రత మీద కూడా శ్రద్ధతీసుకోవాలనేది ఈసందేశం. దీనికోసం ఆమె అన్నలకు ఒక హెల్మెట్ కూడా కానుకగా ఇచ్చారు.
అటువైపు ఆంధ్రలో మరొక అగ్రశ్రేణి రాజకీయ కుటుంబంలో రాఖీ సందడి కలర్ ఫుల్ గా జరిగింది. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. షర్మిలా ప్రశాంతంగా ఉన్న ఫైర్ బ్రాండ్. ఇపుడు ఆమె నిశబ్దంగా ఉన్నారుగాని తన రాజకీయ సత్తా ఏమిటో చాలా సార్లు చూపించారు.
అయితే, మూడో రాజకీయ కుటుంబం చంద్రబాబుది. ఆయన ఒక్కడే కొడుకు నారా లోకేశ్. అందువల్ల లోకేశ్ కు చెల్లెలు లేక రాఖీ పండగ కొంత వెలితిగా కనిపించింది. ఈ వెలితిని తీర్చుకునేందుకు సెక్రెటేరియట్ లో ఆయన పార్టీ కార్యకర్తలతో,అభిమానులతో రాఖీ కట్టించుకున్నారు.