‘భారత రత్న’కు జయ అనర్హురాలు

First Published Dec 21, 2016, 9:39 AM IST
Highlights

అవినీతి కేసుల్లో  ఇరక్కుని ఉన్న జయలలితకు ‘భారత రత్న’  అవార్డు పొందేంత అర్హత లేదు

 

దివంగత ఎఐడిఎంకె నాయకురాలు జయలలితకు భారత రత్న ఇవ్వాలన్నడిమాండ్ కు తమిళనాట వ్యతిరేకత వ్యక్తం కావడం మొదలయింది.

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భారత రత్న గౌరవానికి అనర్హురాలని పత్తలి మక్కలి కచ్చి (పిఎంకె)  నాయకుడు మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రామ్ దాస్ అభిప్రాయపడుతున్నారు.

 

రెండు రోజుల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం న్యూఢిల్లీలో ప్రధానిని నరేంద్ర మోదీని కలుసుకుని ఇటీవల చనిపోయిన తమ పార్టీ  నాయకులు జె జయలలితకు భారత రత్న గౌరవం అందించాలని కోరారు.

 

అయితే, యుపిఎ ప్రభుత్వంలో గతంలో  ఆయన  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అన్బుమణి దీనిని వ్యతిరేకిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వంలో  బాగా పేరు తెచ్చుకున్న  యువమంత్రులలో రామ్ దాస్ ఒకరు.

 

ఇపుడు జయలలితకు మరణానంతం భారత రత్న ఇవాలన్న పన్నీర్ సెల్వం కోర్కె మీద వ్యాఖ్యానిస్తూ అమెకు అంత గౌరవం పొందే అర్హత లేదని అన్నారు.

 

“దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని అవినీతి కేసులున్నాయి. పదిహనుకేసులున్నాయి. హైకోర్టు ఆమె దోషిగా తేలుస్తూ జైలు శిక్ష కూడా విధించింది. అవినీతి అరోపణలకు సంబంధించి తన మీద ఉన్న కేసులను కొట్టివేయాలని  చేసుకున్న ఆమె అభ్యర్థన ఇంకా సుప్రీం కోర్టు పరిధిలోఉంది. దేశంలో అవినీతి కేసుల్లో జైలు లో గడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఆమయే.

 

ఆమె పరిపాలన వల్ల రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. తమిళనాడు రుణభారం రు. 10.5 లక్షల కోట్లు. పారిశ్రామిక ప్రగతిలో దేశంలో అట్టడుగున ఉంది...  ఏవిధంగా ఆమె భారత రత్నకు అర్హురాలు?,” ఇది ఆయన చేసిన వ్యాఖ్య.

click me!