
ఉదయం నుండి ఎండ, వేడిమితో విజయవాడ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిన మాట నిజమే కాని, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పలకరించింది. నగర వాసులు బాగా రిలీఫ్ ఫీలయ్యారు.అయితే, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఈ వాన విజయవాడ మరొక దృశ్యాన్ని బయటపెట్టింది. సాధారణంగా చిన్న వర్షం కురిస్తే విజయవాడ తలకిందులై పోతుందిగా. ఈ సాయంకాలం కురిసింది. జడివాన. రోడ్డన్నిమునిగిపోయాయి.నగరంలో లోని పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డు ,డి వి మేనార్ ,సిద్దార్థ్ స్కూల్ రోడ్డు మొగల్రాజపురం ప్రాంతాలలో లోతట్టు పరిసరాల రోడ్లన్నీ వరదమయ్యాయి. ఉన్నట్లుండి వాన రావటంతో వాహన దారులు తెగ ఇబ్బందులు పడ్డారు ఇలా... వీడియో చూడండి.