రైల్వే బోర్డు కొత్త ఛెయిర్మన్ గా లోహాని

First Published Aug 23, 2017, 1:28 PM IST
Highlights
  • రైల్వే బోర్డు ఛెయిర్మన్ మిత్తల్ రాజీనామా
  • కొత్త ఛెయిర్మన్ గా అశ్విన్ లోహాని

 

 

ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లోహాని  రైల్వే బోర్డు కొత్త ఛెయిర్మన్ నియమితులయ్యారు.క్యాబినెట్ నియమాకాల కమిటీ దీనికి  ఆమోద ముద్ర వేసింది. రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు  మంత్రి సురేశ్ ప్రధానిని కలసిన కొద్ది గంటల్లోనే  ఎయిర్ ఇండియా ఛెయిర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ని రైల్వే బోర్డు చీఫ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

 

దేశంలో జరుగుతున్న భారీ రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే  బోర్డు ఛెయిర్మన్ అశోక్ మిత్తల్ రాజీనామా చేశారు. రాజీనామాను రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు అందించినట్లువిశ్వసనీయంగా తెలిసింది. ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లోజరిగిన కైఫీయత్  ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో  74  మంది గాయపడ్డారు. దీనితో ఆయన రాజీనామా చేసినట్లుచెబుతున్నారు. ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిన నాలుగు రోజులకే ఈ ప్రమాదం జరగడం రైల్వే శాఖను కుదిపేసింది. మిత్తల్ హాయంలో పలు పెద్ద ప్రమాదాలు జరిగాయి.  ఇరవై మందికి పైగా చనిపోయిన మొన్నటి ఉత్తర ప్రదేశ్ ఉత్కల్ ఎక్స్ ప్రెస్   ప్రమాదం రెండోది. మొదటిప్రమాదం గత ఏడాది  జరిగింది. కాన్పూర్ వద్ద శియల్దా-అజ్మీర్ ఎక్స్ ప్రెస్  ప్రమాదం జరిగింది. ఇందులో 44  మంది గాయపడ్డారు. నిజానికి అంతకు నెల రోజుల కిందటే ఇండోర్ -పాట్నా ఎక్స్ ప్రెస్  పట్టాలు తప్పిన ప్రమాదం లో  155 మంది చనిపోయారు.వీటన్నింటికి బాధ్యత వహిస్తూ మిత్తల్ రాజీనామా చేశారని అనుకుంటున్నారు. రైల్వే మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడ లేదు.

 

Read more news at    Asianet-Telugu Express News

 

click me!