కోహ్లీ, యువ‌రాజ్‌, ధావ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చిన బాలీవుడ్ సింగర్

Published : Aug 23, 2017, 11:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కోహ్లీ, యువ‌రాజ్‌, ధావ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చిన బాలీవుడ్ సింగర్

సారాంశం

"మా గురించి విరాట్ కోహ్లీ, యువరాజ్, శిఖర్ ధావన్ లకు ఏం తెలుసు ". ఎడుస్తూ అంకేలను చదివిన పాప వీడియో వైరల్ పై స్పంధించిన సింగర్. 

"మా గురించి విరాట్ కోహ్లీ, యువరాజ్, శిఖర్ ధావన్ లకు ఏం తెలుసు " అని ప్రశ్నించాడు బాలీవుడ్ ప్రముఖ సింగర్ తోషీ. క్రికెటర్లపై సింగర్ ఎందుకు మండిపడుతున్నారని అనుకుంటున్నారా... ! రెండు రోజుల క్రితం అంకెలు చెప్పేందుకు బాధపడుతూ ఏడుస్తున్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే... 

ఆ వీడియోను టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువరాజ్, శిఖర్ ధావన్ తన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా పోస్టు చేస్తూ.... చిన్నారిని చదువు పేరుతో హింసిస్తున్నారు.. సరైనా పద్దతి కాదు అని వారు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై క్రికెటర్లతో పాటు చాాలా మంది నెటిజన్లు పిల్లను అలా చేయడం తప్పని వ్యాఖ్యానించారు. 

 

అయితే ఆ పాప ఎవరో తెలిసిపోయింది. ఆమె బాలీవుడ్ సెలబ్రిటీ, సింగర్, సంగీత దర్శకుడు తోషీ మూడేళ్ల మేనకోడలు పేరు "హయా". తన మేనకోడలు వీడియో చూపుతూ విమర్శించిన వారిపై విరుచుకుపడ్డాడు. "విరాట్ కోహ్లీ, ధావన్, యువరాజ్ లకు మా గురించి తెలియదు", " మా పాప గురించి మాకు తెలుసు". హయా ఎలాంటిదో.. ఎప్పుడు ఎం చేస్తుందో తమకు తెలుసు... , ఏడుస్తూ చదవడం ఆమె అలవాటు. తరువాతి నిమిషంలోనే ఆటలకు వెళ్లిపోతుంది. "మేం ఒత్తిడి చేయకుంటే భవిషత్తులో హయా జీవితం పాడవ్వదు" అని తోషి పెర్కొన్నారు. 

 

హయా స్కూల్ లో అంకెలు నేర్చుకోవాలని ఇచ్చిన హోం వర్క్ ను తను పూర్తి చేసిందని టీచర్లకు చెప్పడానికి ఆ వీడియో తీసినట్లు తోషి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు బోధించే విషయంలో ఒకటిన్నర నిమిషం వీడియో చూసి అందరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారని ప్రశ్నించాడు. 

 

 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నంద్యాల పోలింగ్ విశేషాలు

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !