రెచ్చిపోయిన రాహుల్ ట్విట్టర్ హ్యాకర్లు

Published : Dec 01, 2016, 10:58 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రెచ్చిపోయిన రాహుల్ ట్విట్టర్ హ్యాకర్లు

సారాంశం

రాహుల్ ట్విట్టర్ హ్యాకర్లు రెచ్చిపోయారు.  బుధవారం ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగానే పార్టీ అకౌంట్  ను కూడా హ్యాక్ చేశారు

 

హ్యాకర్లు కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించినట్లున్నారు.   గురువారం వారు మరీ రెచ్చిపోయారు.

 

ఈ సారి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ లోకి చొరబడి బెదిరింపు ట్వీట్ లు పోస్టు చేశారు.

 

గురువారం ఉదయం పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్లను  హ్యాక్ చేసిన వ్యవహారానికి సంబంధించి గురువారం నాడు ఢిల్లీ పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే,కొదిసేపట్లోనే  సైబర్ అగంతకులు కాంగ్రెస్ పార్టీ అకౌంట్  ను కూడా హాక్ చేసి, తాము పోలీసు కేసులకు భయపడేది లేదన్న మెసేజ్ పంపించారు.

 

రాహుల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం పెద్ద వివాదం కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ ఎఐసిసి  చేసిన ఫిర్యాదు మీద, కేసు మీద లెఫ్టినెంట్ గవర్నర్   నజీబ్ జంగ్ కు సమాచారం అందించారు. ఈ లోపు, గత అరు రోజులలో రాహుల్ గాంధీ ట్టిట్టర్ అకౌంట్ వివరాలను అందించాలని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ నుకోరింది.

 

ఏవరో ఐటి అగంతకులు బుధవారం రాత్రి రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్లోకి చొరబడి అసభ్యకరమయిన ట్వీట్లనే ప్రచురించారు.  ఈ ట్వీట్లను వెంటనే తొలగించడం జరిగింది. ఈ ట్వీట్లన్ని కాంగ్రెస్ నేత వ్యక్తి లైంగిక జీవితానికి సంబంధించినవిగా ఉన్నాయి.

 

’క్రిష్టిమస్ స్పెషల్ గా  ఇ-మెయిల్సన్నీ బజార్లో వేస్తాం. కాచుకో.మీ పార్టీ చించేసేంత సమాచారం మాదగ్గిర ఉంది,’ అని హ్యాకర్లు హెచ్చరించారు.

 

తర్వాత గురు వారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధికారిక అకౌంట్ ను కూడా స్వాధీనం చేసుకుని  ట్వీట్లను పోస్ట్ చేశారు.  దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ కు హ్యాకింగ్ పై ఫిర్యాదు చేసింది. త్వరలోనే కాంగ్రస్ కు సంబంధించి కీలకమయిన ఇ-మెయిల్సన్నింటిని కుప్పలుతెప్పలుగా  వెల్లడిస్తామని హ్యకర్స్ హెచ్చరించారు. ఇలా చేస్తున్నప్పటికీ తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కూడ హ్యాకర్స్ స్పష్టం చేశారు.

 

 పార్లమెంటులో అన్ లైన్ సెక్యూరిటీ ఎలా విఫలమయిందో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ముందు పెట్టాలనుకుంటోంది.

ఇవే హ్యాకర్లు పోస్టు చేసిన ట్వీట్స్ 

:

"Coming up is a full dump of inc.in congress emails, stay tuned for Christmas special. We have enough info to drop your party down to shreds."

 

"Congress can kiss our ass. Legion shall prevail, justice shall strike!" అనేవి కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్ @INCIndia లో వచ్చిన పోస్ట్ లు.

 

"And rahul gandhi, you can kiss our ass you silly retarded tw4t. Need some life lessons on autism bro?" అనేది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అకౌంట్ లో పోస్ట అయిన పిన్ డ్ ట్వీట్.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !