అది..మహిళా లోకం దెబ్బంటే

First Published Dec 1, 2016, 10:46 AM IST
Highlights

దేశవ్యాప్తంగా మహిళల మనోభావాలను గ్రహించిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.

మహిళా లోకం దెబ్బకు కేంద్రం తలొంచింది. నూతన ఐటి చట్టంలో బంగారంపై పన్ను విషయంలో కేంద్రం అనేక కఠిన నిబంధనలను విధించింది. సదరు నిబంధనలపై దేశంలోని మహిళా లోకం పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతోంది. అయితే, మహిళల మనోభావాలను గ్రహించిన కేంద్రం ఒక్కరోజులోనే మాటమార్చింది. ఎప్పుడైతే చట్టంలోని అంశాలు వెలుగు చూసాయో దేశవ్యాప్తంగా మహిళలు మండిపడ్డారు.

 

దేశవ్యాప్తంగా మహిళల మనోభావాలను గ్రహించిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. త్వరలో జరుగనున్న పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోంది. బంగారం లెక్కల విషయంలో మహిళలతో పెట్టుకుంటే పుట్టగతులుండవన్న వాస్తవాన్ని గ్రహించిన కేంద్రం ఒక్కరోజులోనే మాటమార్చింది.

 

నూతన ఐటి చట్టంలో తమ వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాలన్నది ప్రాధమిక నిబంధన. అదేవిధంగా, వారసత్వంగా వచ్చిన బంగారానికి కూడా లెక్కలు చెప్పాల్సిందే. చెప్పలేకపోతే దాని ఖరీదులో 85 శాతం పన్ను కట్టాల్సిందేనన్నది రెండోది. అంతేకాకుండా తమ వద్ద ఉన్న ప్రతీ బంగారు ఆభరణనికీ బిల్లులు చూపాల్సిందేనట. దేనికి బిల్లు చూపలేకపోయినా దానిపై పన్ను విధిస్తారట. పై నిబంధనలపై మహిళా లోకం కేంద్రంపై దేశవ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తోంది. దాంతో కేంద్రం దిగొచ్చింది.

 

 ఇదే విషయమై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, వారసత్వంగా వచ్చిన బంగారానికి లెక్కలు చెప్పక్కర్లేదన్నారు. ప్రతీ వివాహిత వద్ద ఉన్న అర్ధ కేజి బంగారంపై కూడా లెక్కలు చెప్పక్కర్లేదన్నారు. అవివాహితుల వద్ద కూడా 250 గ్రాముల బంగారం ఉండవచ్చని, పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం వరకూ ఉండవచ్చని స్పష్టం చేసారు. అంతేకాకుండా ఇంట్లో దాచుకున్న డబ్బుతోనే కాకుండా పన్ను మినహాయింపు ఉన్నడబ్బుతో బంగారం కొన్నా సమస్య ఉండదన్నారు.

 

అయితే, ఇక్కడే సమస్య వస్తోంది. బంగారం కొనుగోలు చేసింది ఇంట్లో దాచుకున్న డబ్బా లేక బయట నుండి తెచ్చుకున్న డబ్బా అన్నది ఎలా తెలుస్తుంది? ప్రతీ వివాహిత వద్దా అర్ధకేజి, అవివాహుల వద్ద ఉన్న 250 గ్రామలు బంగారానికి పన్నుండదన్నారు. అర్ధకేజి, 250 గ్రాముల బంగారం అన్న నిబంధనను సైతం మహిళలు ఒప్పుకోవటం లేదు. చూడాలి మహిళలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంకెన్ని మినహాయింపులు ఇస్తారో రాబోయే రోజుల్లో.

 

click me!