అమెరికాలో రాహుల్ గాంధీకి అరుదైన గుర్తింపు

First Published Aug 31, 2017, 2:41 PM IST
Highlights
  • ఎపుడో 1949లో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ  అక్కడ ప్రసంగించారు
  • ఇపుడు రాహుల్ గాంధీకి ఈ అవకాశం లభించింది

ప్రతిష్టాత్మకమయిన అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ  భారత రాజకీయాల మీద కీలకోపన్యాసం చేయబోతున్నారు. సెప్టెంబర్ 11 వ తేదీన ఆయన ‘ ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్’ అనే అంశం మీద ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇన్ట్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బెర్క్ లీ రీసెర్చ్ ఆన్ కాంటెంపొరరీ ఇండియా ఏర్పాటుచేస్తున్నది.

ఇది రాహుల్ గాంధీకి దక్కిన చాలా పెద్ద గౌరవం. ఎందుకంటే, నెహ్రూకుటుంబంలో ఇలాంటి అవకాశం వచ్చిన రెండో వ్యక్తి రాహుల్ గాంధీ. మొదటి వ్యక్తి రాహుల్ తాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.  నెహ్రూ 1949లో  ఇదేవిశ్వవిద్యాలయంలో మొదటి ఉపన్యాసం ఇచ్చారు. ఇది ఒక చారిత్రాత్మక ఘటన అయింది. ఇపుడు తన సత్తా చూపుకునేందుకు రాహుల్ కు అవకాశం మొచ్చింది.

అయితే, కొన్ని శిక్కు హక్కలు సంస్థలు మాత్రం రాహుల్ గాంధీకి కార్యక్రమాన్ని రద్దుచేయాలని కోరుతున్నాయి.  1984లో ఇందిరా హత్య అనంతరం జరిగిన శిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ పాత్ర ఉందని ఈ సంస్థల నేతలు నిరసిస్తున్నారు.అందుకు వారు రాహుల్ విశ్వవిద్యాలయానికి రావడానికివీల్లేదని చెబుతున్నారు.

click me!