‘నెట్’లో దూసుకెళ్లిన సింధు

Published : Dec 02, 2016, 08:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
‘నెట్’లో దూసుకెళ్లిన సింధు

సారాంశం

యాహూ సర్వేలో టాప్ లో నిలిచిన తెలుగు తేజం

 

సినీతారలు, రాజకీయ నాయకులను కాదని ప్రపంచం మొత్తం ఈ ఏడాది ఎక్కువగా మాట్లాడుకుంది మన ఒలంపియన్ల గురించేనట.

 

సెర్చింజన్ దిగ్గజం యాహూనే ఈ విషయాన్ని వెల్లడించింది. రియో ఒలింపిక్స్ లో పతకాల పంట పండించిన తెలుగుతేజం పివి సింధు తాజాగా నిర్వహించిన సర్వేలో అందిరినీ వెనక్కి నెట్టి నెట్ లో టాప్ లేపింది.

 

2016లో దేశంలో వివిధ రంగాల్లో అత్యధికంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులపై యాహూ ఒక సర్వే చేపట్టింది.

 

ఇందులో రియో ఒలింపిక్స్‌ విజేత సింధు టాప్ లో నిలవగా, తర్వాత స్థానంలో దీప కర్మాకర్‌ నిలిచింది. రెజ్లర్లు సాక్షి మలిక్‌, విఘ్నేశ్‌ పొగట్‌లు కూడా అత్యధికంగా వార్తల్లో కన్పించిన వ్యక్తుల్లా నిలిచారు.క్రికెటర్లను కూడా కాదని అభిమానులు నెట్ లో వీళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం విశేషం.

 

ఇక అత్యధికంగా నెటిజన్లు మాట్లాడుకున్న రాజకీయనాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిలిచారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సెకెండ్ ప్లేస్ లో నిలిచారు.

 

సోషల్‌మీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదంగా  ‘రియో ఒలింపిక్స్‌’ నిలవగా తర్వాతి స్థానంలో ‘ఐపీఎల్‌’ నిలిచింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !