
కాంగ్రెస్ నాయకురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రత్యక్ష మయ్యారు.
కుమారుడు రేహన్ కంటి పరీక్ష కోసం ఆమె హైదరాబాద్ లోని ఎల్ విప్రసాద్ ఇన్స్ స్టిట్యూట్ కు ఈ మధ్యాహ్నం చేరుకున్నారు.
నిన్నటి దాకా యుపి ఎన్నికల ప్రచారంలో హడావిడిగా ఉన్న ప్రియాంక ఈ రోజు హైదరాబాద్ లో అకస్మాత్తుగా కనిపించడం అసుపత్రి అవరణలో ఉన్నవారందరిని అశ్యర్యానికి గురి చేసింది.
ఆమె వెంట రాజ్యసభ సభ్యుడ టి సుబ్బరామిరెడ్డి కూతరు పింకి రెడ్డి కూడా ఉన్నారు.
ఈ మధ్య క్రికెట్ అడుతున్నపుడు కుమారుడు రేహన్ కంటికి దెబ్బతగిలింది. తర్వాత ఢిల్లీలోని ఎఐఐఎంఎస్ కు తీసుకువెళ్లి పరీక్ష చేయించారు. వారు వెంటనే హైదరాబాద్ లోని ఎల్ విప్రసాద్ ఇన్ స్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆమె హైదరాబాద్ కు వచ్చారని తెలిసింది.
ఈ విషయం మీద ఆసుపత్రివర్గాలు మాట్లాడనిరాకరించాయి.
ప్రియాంక హైదరాబాద్ రాక విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదు. కొంతమంది ప్రముఖుకుల మాత్రం ఈ ఉదయం చెప్పి, ఎవరూ ప్రియాంకను కలువద్దని సలహా ఇచ్చారు.
‘ ఇది పూర్తిగా ప్రయివేటు పర్యటన. వైద్యపరీక్షల కోసం ఆమెవస్తున్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తులు వెళ్లి ఇబ్బంది పెట్టవద్దు,’ అని టెన్ జన్ పథ్ నుంచి సూచనలు వచ్చినట్లు సీనియర నాయకుడొకరు ఎసియానెట్ కు తెలిపారు.
ఆమె ఈ సాయంకాలమే ఢిల్లీ వెళ్లిపోతున్నారు.
హైదరాబాద్ హెల్త్ క్యాపిటల్ అయిందనేందుకు ఇదొక తార్కాణం. ఎయిమ్స్ కూడా రోగులను హైదరాబాద్ ఆసుపత్రికి సిఫార్స్ చేయడం విశేషం.