హన్నా... డీఎంకే !

Published : Feb 17, 2017, 03:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
హన్నా... డీఎంకే !

సారాంశం

పిట్టపోరు పిట్టపోరు పిల్లికి లాభం అనే సామెత రేపు తమిళనాట రుజువవుతుందా...?    

పిట్టపోరు పిట్టపోరు పిల్లికి లాభం అనే సామెత రేపు తమిళనాట రుజువవుతుందా...?

అన్నా డీఎంకే సంక్షోభం చివరకు డీఎంకే కు లాభంగా మారనుందా...?

ఇదంతా పూర్తిగా తేలాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే...

డీఎంకే తాజాగా తీసుకున్న నిర్ణయంతో సమీకరణాలు మారుతున్నాయి.

 

అసెంబ్లీలో బలనిరూపణ చేపడితే తాము దూరంగా ఉంటామన్న డీఎంకే ఇప్పుడు మాట మార్చింది. తాము రేపు అసెంబ్లీలో నిర్వహించే బలపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆ పార్టీ అధినేత స్టాలిన్ ప్రకటించి శశికళ వర్గానికి షాక్ ఇచ్చారు. దీంతో తమిళనాట అసలు ఆట ఇప్పుడే మొదలైంది.

 

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాలో 117 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే సరిపోతుంది. బలపరీక్షలో నెగ్గొచ్చు.  ఇప్పటికే శశికళ వర్గంలో 124 మంది ఉన్నారు.  కానీ, వారందరూ తమ వైపే బలపరీక్ష రోజు ఉంటారనే నమ్మకం శశికళ వర్గం లో లేదు. అందుకే స్టాలిన్ ప్రకటన వారి గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.

 

కాగా, డీఎంకే అధినేత స్టాలిన్ రేపటి బలపరీక్షను తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఆయన భావిస్తున్నారు.

 

ఇప్పటికే డీఎంకే పార్టీలో 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు పన్నీరు వర్గంలో ఉన్న 10 మంది కూడా బలపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారు. ఇక కాంగ్రెస్‌కు చెందిన 8 మంది కూడా స్టాలిన్ వైపే ఉన్నారు.

 

అంటే ఇప్పుడు స్టాలిన్ బలం 107గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. ఆ 10 మందిని శశికళ వర్గం నుంచి స్టాలిన్ తన వైపు లాగితే ప్రభుత్వం పడిపోతుంది. తమిళనాట మళ్లీ ‘సూర్యుడు ఉదయించే’ అవకాశం ఉండొచ్చు.

 

స్టాలిన్ ఎత్తుగడ ఫలిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !