తగ్గనున్న నిత్యావసరాల ధరలు

First Published May 19, 2017, 7:54 AM IST
Highlights

జైట్లీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయమైంది. 1211 రకాల వస్తువలపై పన్ను రేట్లను తగ్గించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నిత్యావసర వస్తువులైన కొబ్బరి నూనె, సబ్బులు, టూత్ పేస్ట్ వస్తువులు తగ్గుతాయి.

నిజంగా దేశప్రజలకు ఇది శుభవార్తే. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల త్వరలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి.  గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జిఎస్టీ) అమల్లో భాగంగా అనేక రకాల వస్తువుల ధరలను నాలుగు స్లాబులుగా విభజించారు. గురువారం కేంద్రమంత్రి జైట్లీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయమైంది. 1211 రకాల వస్తువలపై పన్ను రేట్లను తగ్గించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నిత్యావసర వస్తువులైన కొబ్బరి నూనె, సబ్బులు, టూత్ పేస్ట్ వస్తువులు తగ్గుతాయి. ప్రస్తుతం పై వస్తువులపై 24 శాతం పన్నులను వసూలు చేస్తున్నారు. త్వరలో ఆ పన్నులు 18 శాతం శ్లాబులోకి వస్తాయి.  అంటే 6 శాతం పన్నులు తగ్గుతాయి.

బొగ్గుపైన ప్రస్తుతం వసూలు అవుతున్న 11.69 శాతం పన్ను 5 శాతానికి తగ్గుతుంది. బొగ్గు ధర తగ్గటం వల్ల బొగ్గు ఆధారంగా ఉత్పత్తవుతున్న విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. సరే పాలు, పెరుగు మీద పన్నే ఉండదు. గోధుమలు, వరిని కూడా పన్ను పరిధి నుండి మినహాయించనుండటంతో వాటి ధరలు కూడా తగ్గుతాయి. ఏసి, రిఫ్రిజిరేటర్ల ధరలు కూడా 4 శాతం తగ్గుతాయి. వంట నూనెలు, టీ, కాఫీ, పంచదారపైన కూడా పన్నులు తగ్గుతున కారణంగా వాటి ధరలు కూడా తగ్గుతాయి. టీవీలు, లాప్ ట్యాప్ లు,కెమెరాలు, వాషింగ్ మెషీన్లు, ఏసీల ధరలు కూడా తగ్గుతాయండోయ్.

ఈరోజు జరిగే సమావేశంలో బీడీలు, బంగారం, దుస్తలు, బయోడీజల్, చెప్పులు, బ్రాండెడ్ ఆహార పదార్ధాలపై విధించాల్సిన పన్నును నిర్ణయిస్తారు. సరే, కార్లు, కోకోకోకలా, పెప్సీ వంటి కూల్ డ్రింక్స్ పై పన్ను ప్రభావం ఉండదులేండి. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడి చెబుతున్నట్లుగా జిఎస్టీ అమలు వల్ల పన్నులు తగ్గి వస్తువుల ధరలు తగ్గితే అంతకన్నా కావాల్సిందేముంటుంది.

click me!