మణిపూర్ అసెంబ్లీలో ఎంతమంది కోటీశ్వరులో

Published : Mar 16, 2017, 08:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
మణిపూర్ అసెంబ్లీలో ఎంతమంది కోటీశ్వరులో

సారాంశం

అసెంబ్లీ స్ధానాలే 60. అందులో 32 మంది కోటీశ్వరులు.

మణిపూర్ రాష్ట్రం గురించి తెలీదు కానీ ఎంఎల్ఏల్లో అత్యధికులు కోటీశ్వరులే. అసెంబ్లీ స్ధానాలే 60. అందులో 32 మంది కోటీశ్వరులు. 2012 సభలోని సభ్యుల సగటు ఆస్తి రూ. 95 లక్షలైతే, మొన్నటి అసెంబ్లీలో గెలిచిన సభ్యుల సగటు ఆస్తి రూ. 2.2 కోట్లు. పోయిన సభలో కోటీశ్వరులు 27 శాతమైతే, ఇప్పటి సభలో ఈ శాతం 53 శాతానికి చేరుకున్నది. రూ. 5 కోట్లకు పైగా ఆస్తులున్న వారు ఇద్దరు. రూ. 2-5 కోట్ల మధ్య సంపద ఉన్నవారి సంఖ్య 17. రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల మధ్య ఆస్తులున్నవారు 27 మందట.

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది సభ్యుల్లో 18 మంది కోటీశ్వరులు. భాజపాలోని 21 మందిలో 10 సంపద బాగా పోగేసినవారే. అందరికన్నా ఎక్కువ ఆస్తి ఉన్న సభ్యుడు కాంగ్రెస్ పార్టికి చెందిన ఎస్. అర్ధుర్. ఈయన ఆస్తి రూ. 36 కోట్లు. ఇవన్నీ ఎన్నికల కమీషన్ ముందు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారమే. మొత్తం 60 మంది సభ్యుల్లో నలుగురికి తీవ్రమైన నేరచరిత్ర కూడా ఉందండోయ్.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !