మోదీకి రాసిన లేఖలో పాక్ చిన్నారి ఏమందంటే..?

Published : Mar 15, 2017, 12:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మోదీకి రాసిన లేఖలో పాక్ చిన్నారి ఏమందంటే..?

సారాంశం

మోదీ విజయాన్ని అభినందిస్తూనే భారత చిరకాల ప్రత్యర్థి పాక్ కు చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది.

ఉత్తరప్రదేశ్ విజయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. నోట్ల రద్దు తర్వాత కూడా ప్రజలు బీజేపీని ఆదరించడంతో మోదీ హవాకు ఇక తిరుగే లేకుండా పోయింది.

 

ఈ నేపథ్యంలో మోదీ విజయాన్ని అభినందిస్తూనే భారత చిరకాల ప్రత్యర్థి పాక్ కు చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది.

 

పాక్ కు చెందిన అదీత్ నవీద్  హృదయాన్ని కదిలించేలా ప్రధానికి రాసిన లేఖలో భారత్, పాక్ ల మధ్య శాంతినెలకొనేలా చూడాలని కోరింది.

 

‘మనసులను గెలవడం అనేది చాలా గొప్ప పని అని మా నాన్న చెప్పేవారు. మీరు భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. ఉత్తపప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా మీకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.

 

మీరు భారత్ తో పాటు పాకిస్తానీయుల హృదయాలను గెలిచుకోవాలి. అందుకోసం ఇరు దేశాల మధ్య పరస్పర శాంతి నెలకొనేందుకు, స్నేహభావం వెల్లివిరిసేందుకు చొరవతీసుకోండి. రెండు దేశాల్లోనూ మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలి. అప్పుడు మేం బుల్లెట్స్ కొనడం వదిలేసి బుక్స్ కొనడానికి సిద్ధమవుతాం. గన్స్ కొనడం మానేసి మెడిసన్స్ కొంటాం.’ అని పేర్కొంది.

 

కాగా, గతంలో కూడా ఈ  చిన్నారి విదేశాంగ మంత్ర సుష్మాస్వరాజ్ కు కూడా లేఖ రాశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !