ఏటిఎంకు పూజలు.. డబ్బులైతే రాలేదు

Published : Dec 05, 2016, 02:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఏటిఎంకు పూజలు.. డబ్బులైతే రాలేదు

సారాంశం

పెద్ద నోట్ల రద్దుపై వినూత్న నిరసన

నోట్ల రద్దు వల్ల దేశంలో ప్రజలంతా బ్యాంకులు, ఏటిఎంల ముందు క్యూ కట్టిన విషయం తెలిసిందే.దేశంలో సగం మంది ప్రజల టైం అంతా ఈ క్యూలోనే గడిచిపోతుంది. ఇంతా కష్టపడ్డా పైసా చేతికొస్తుందన్న నమ్మకం లేదు.

 

ముఖ్యంగా బ్యాంకుల ప్రణాళికలోపం వల్ల ఏటిఎంలలో డబ్బులే ఉండటం లేదు.. ఉన్నా రెండు నిమిషాల్లో అయిపోతున్నాయి. అక్కడి క్యూలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఏటిఎం క్యూలో నిలబడ్డా డబ్బులు చేతిక అందక చిర్రెతుక్కొచ్చిన ఢిల్లీలోని కొంతమంది వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు.

 

జగత్‌పురిలోని  స్థానికులు అక్కడి  స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం సెంటర్లో ఎప్పుడూ నో క్యాష్‌ బోర్డు కనిపిస్తుండటంతో ఆగ్రహానికి గురయ్యారు.

 

కానీ, ఆ కోపాన్ని కాస్త వినూత్న రీతిలో ప్రదర్శించారు. ఏటీఎం కు సంప్రదాయబద్దంగా  పూజలు చేశారు.. హారతి ఇచ్చి పూలదండ వేసి కీర్తనలు పాడారు... చివరగా తమకు డబ్బులు ప్రసాదించాలని వేడుకున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !