
విచిత్రమయిన భారత రాజకీయాలకు జయలలిత నిలువుటద్దం. ఆమె రాజకీయ జీవితమంతా సంచలనాలే. తిరుగులేని విజయాలు, ఘోరా పరాజయాలు, అవినీతి ఆరోపణలు, కేసులు,జైలు శిక్ష, వెల్లువెత్తే ప్రజాభిమానం, అవమానాలు, వెనకంజవేయని ధీరత్వం.. అమెరాజకీయ జీవితం నిండాపుష్కలంగా లభిస్తాయి. ప్రజల్లో అవినీతిని అసహ్యించుకునే గుణం ఉంటే, ఆమె మీద వచ్చిన అరోపణలు, వెనకేసుకున్న సంపద, పెంపుడు సుధాకరన్ పెళ్లి వైభవం చూసి ఆమెను శంకరగిరి మాన్యాలకు పంపించాలి. ఇలా ఎపుడూ జరగలేదు. గెలుపు ఓటమి ఎన్నికల్లో సహజంగా తారసపడినట్లే అమె ఓడారు, గెల్చారు. ప్రజలు అమెను శిక్షించారనుకోలేం.తమిళపేదలకు ఆమె అమ్మ, రాజకీయాలలో ఆమె జయమ్మ
సినిమాల ద్వారా ఎం.జి రామచంద్రన్ కు సన్నిహితమయి,చివరకు ఆయన రాజకీయ వారసురాలయింది. ఎంజిఆర్ రాజకీయ వారసత్వం సొంతభార్య జానకికే దక్కాలని కొంత మంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1987లో ఎంజిఆర్ చనిపోయాక పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం జానకీ రామచంద్రన్ ని ముఖ్యమంత్రిని చేయాలనింది. ఇది జరిగినా, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అమె ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయించి రెండో వర్గానికి చెందిన జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు సహాయం చేశారు. జానకీ రామచంద్రన్ 21 రోజుల మించి అధికారంలో లేరు.
చక్కటి ఇంగ్లీష్ లో మాట్లాడటం తొందరగా రాజకీయ శిఖరాన్నధిరోహించేందుకు దోహదపడింది. ఇంగ్లీష్ తెలిసిన నాయకులొకరు పార్లమెంటులో ఉండాలని ఎంజిఆర్ ఆమెను 1984 లో రాజ్యసభకు పంపారు. అపుడే అమె పలువురు దేశ రాజకీయ నాయకులకు దగ్గిరయ్యారు. రాజీవ్ గాంధీకి సన్నిహితమయ్యేందుకు కూడా ఇంగ్లీషే కారణమని చెబుతారు.
1983లో ఎంజిఆర్ ఆమెను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు.దీని తర్వాత అమెకు, ఎంజిఆర్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఎంజిఆర్ స్ట్రోక్ వచ్చి అమెరికాలో చికిత్సకు వెళ్లినపుడు తానిక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తలుపు తట్టిందనుకున్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని రాజీవ్ గాంధీని కోరారు. అయితే, ఆరోగ్యం కోలుకుని తిరిగొచ్చాక, ఎంజి ఆర్ అమెను పార్టీ పదవులనుంచి తప్పించారు.అయితే తర్వాత జరిగిన అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలలో అమె బాగా ప్రచారం చేసి, ఎంజిఆర్ ప్రచారం చేయని లోటు తీర్చారు.
జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది.
5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందారు.
15వ యేట సినిమా రంగములో ప్రవేశించారు. 1961లో Epistle అనే ఇంగ్లీష్ సినిమాలో నటించారు. తమిళంలో నాయికగా నటించిన వెన్నిర ఆడై ( ధవళ వస్త్రం) సూపర్ హిట్ కావడంతో ఆమె సినీజీవితం కొత్త మలుపు తిరిగింది.
జయలలిత జయరాం ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం,వేదవల్లి దంపతులకు జన్మించింది.