భగ్గున మండేందుకు సిద్ధంగా ఉన్న నంద్యాల

First Published Aug 8, 2017, 8:37 AM IST
Highlights
  • నంద్యాల ఉప ఎన్నికల ఊరంతా ఉద్రిక్తత 
  • ఏ క్షణాన ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి
  • శాంతి భద్రతల కోసం పారా మిలిటరీ బలగం మొహరిపంపు

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అధికారప్రతిక్ష పార్టీలు చావో బతుకో అన్నట్లు పోరాడుతూ ఉండటంతో ఇక్కడి పరిస్థితులను కేవలం రాష్ట్ర పోలీసులు మాత్రమే అదుపు చేయలేరనే నిర్ణయాకి వచ్చింది.

వూరంతా మంత్రుల మకాంలు, వారికి పోటీ ప్రతిపక్ష పార్టీ నేతలు, నంద్యాల యుద్ధభూమిని తలిపిస్తూ ఉంది. ఇరు పక్షాలు హోరా హోరిగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి. ర్యాలీలు, పెద్ద పెద్ద గుంపులతో  ఇం టింటి ప్రచారం తీవ్రంగా సాగుతూ ఉంది.  అందువల్ల ఈ బలగాలు ఎపుడయిన ఎదురుపడి, కోట్లాటలకు దిగే అవకాశం ఉందిని జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికితోడు తరచు ముఖ్యమంత్రి పర్యటనలు, జగన్ ఎన్నికల కాలమంతా ఇక్కడే ఉండాలనుకోవడం కూడా ఉద్రికత్తకు తోడవుతూ ఉందని స్థానిక పోలీసు అధికారి ఒకరు ఏషియానెట్ కు తెలిపారు.

‘ఉప ఎన్నికను సాధారణంగా పార్టీలు స్థానిక నేతలకు వదిలేస్తుంటాయి. ఒకరద్దిరు పరిశీలకును పంపిస్తాయి.  పార్టీ అధ్యక్షుడు ఉప ఎన్నికలలో ప్రచారం అరుదు. ఇక ముఖ్యమంత్రి ఇన్ని సార్లు ఉప ఎన్నిక ప్రచారం చేయడంతోగతంలో ఎపుడూ జరగలేదు. దీనికి ఈ ప్రాంతా రాజకీయ స్వభావం అన్ని కలసి ఉద్రికత్త ను సృష్టించాయి. అయితే పరిస్థితి అదుపులో ఉంది,’ అని ఎన్నికల విధులలో ఒక అధికారి ఒకరు తెలిపారు.

 

నంద్యాలలో మొత్తం ఓటర్లు :
174999,(2014 లెక్కల ప్రకారం) 

బలమయిన వర్గాలు 
ముస్లింలు : 56000,
బీసీ : 45000,
కాపు బలిజ : 30000,
వైశ్య : 25000,
ఇతరులు :(రెడ్డి తదితర కులాలు) -18999,
2014 జనరల్ ఎలక్షన్ లో
YSRCP : 82194,
TDP : 78590
మెజారిటీ : 3604..

 

నంద్యాల గెలుపును టిడిపి, వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమొక్కటేకాదు, ఇరుపక్షాలకు బలమున్న ప్రాంతాలలో ప్రత్యర్థులను రానీయని వాతావరణం కల్పిస్తున్నాయి.ఇది కూడా ఉద్రికత్తతకు తోడవుతూ ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా   ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్  జగన్   చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో జగన్‌కు కమిషన్  నోటీసులు జారీ చేసింది ఆయన నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తోంది.

 ఇదే సమయంలో నామినేషన్ల పరిశీలన సమయంలోకూడా నంద్యాల పట్టణంలో ఉద్రికత్త నెలకొంది. పట్టణంలో ఎపుడేం జరుగుతుందోనన్నభయాందోళన నెలకొంది. నామినేషన్లు చెల్లవంటూ టిడిపి, వైకాపా అభ్యర్థులు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో వాటిపై విచారణకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ ప్రసన్న వెంకటేష్ సుమారు మూడు గంటల సమయం తీసుకున్నారు. నామినేషన్ల మీద పరస్పరం ఫిర్యాదు  చేసుకోవడంతో వీరివురి నామినేషన్లను తిరస్కరిస్తారని ప్రచారం సాగింది. ఉద్రిక్త త తీవ్రమయింది. ఇలా ఏ క్షణాన్నయిన భగ్గున మండే వాతావరణం కనిపించడంతో చిన్న ఉప ఎన్నికయినా ఎన్నికల కమిషన్ కేంద్రబలగాలతో నే ఢీకొనాలని నిర్ణయించింది.

నంద్యాల ఉద్రిక్త వాతావరణం ఎపుడయినా కట్లు తెంచుకుని అలజడిగా మారే పరస్థితులు కనిపించడంతో శాంతి, భద్రతల పరిరక్షణకు  ఎన్నికల కమిషన్  కేంద్ర బలగాలను రప్పించాలని నిర్ణయించింది. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికల భద్రతను పారా మిలిటరీకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో నంద్యాలకు 7 కంపెనీల పారా మిలిటరీ బృందాలు చేరుకునే అవకాశముందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు.

 

click me!