ఆన్ లైన్ లో సెలవు దరఖాస్తు...

First Published Aug 27, 2017, 11:13 AM IST
Highlights
  • . ఈ విధానం దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా అమల్లోకి రావడం విశేషం.
  • దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని వారు చెబుతున్నారు.

 

పోలీసు శాఖలో సెలవుల విధానం సులభతరం కానుంది. ఇందు కోసం పోలీసు ఉన్నతాధికారులు నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం... సెలవులు కావాల్సిన   అధికారులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా అమల్లోకి రావడం విశేషం.

 

ఇప్పటి వరకు ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కలిసి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత.. వారు పరిశీలించి సెలవు ఇచ్చేది లేనిది చెప్పే వారు. ఇకపై అలా కాకుండా కూర్చున్న చోటు నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారుల నుంచి రిప్లై అందేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో సెలవుకోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవలే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని వారు చెబుతున్నారు.

 

8గంటలు.. డ్యూటీ అవర్స్ అనేది పోలీసుల విషయంలో పేరుకు మాత్రమే. కానీ వారు  14, 15గంటలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. రోజూ అన్నన్ని గంటలు పనిచేయడం వల్ల వారిలో ఒక విధమైన ఫ్రస్టేషన్ మొదలువుతంది.  దానిని కాస్త ప్రజలపై చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి సెలవు దినాలు కూడా తక్కువ. అత్యవసరంగా సెలవు కావాల్సి వచ్చినా.. ఉన్నతాధికారులు ఓ పట్టాన మంజూరు చేయరు. కాబట్టి  వారందరికీ సెలవులు అనేది అందని ద్రాక్షగా ఉండిపోతోంది. అయితే.. ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఆన్ లైన్ విధానం కాస్త వారికి ఊరట కలిగించే అవకాశం ఉంది.

 

ఓ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ఆన్‌లైన్‌లో సెలవుకు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత డీసీపీకి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుతుంది. సంబంధిత ఏసీపీ నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న తర్వాత సెలవు మంజూరు చేస్తున్నది, లేనిది తిరిగి ఆన్‌లైన్‌లోనే సమాచారం అందజేస్తారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల సెలవు అవసరమైన అధికారులు, సిబ్బంది తమ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కలిసే అవసరం లేకుండా ఒక్క క్లిక్‌తోనే పని పూర్తయ్యే అవకాశం ఏర్పడింది

click me!