బంగారు దొంగల సెల్ ఫోన్ దొరికింది

Published : Jul 12, 2017, 01:46 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బంగారు దొంగల సెల్ ఫోన్ దొరికింది

సారాంశం

మంగళవారం రాత్రి విజయవాడలోని ఒక నగల తయారీ సెంటర్లో చొరబడిన దొంగలు దాదాపు ఏడు కిలోల నగలతో పరారీ పోలీసులకు చిక్కిన కీలకమయిన వస్తువు గుంటూరుమిర్చియార్డు వద్ద మొబైల్ ఫోన్ వదలివేసిన దొంగలు

గుంటూరు: బీసెంట్‌రోడ్‌లోని ఒక నగల తయారీ కేంద్రంలో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి కీలకసమాచారం దొరికింది.

 

 దోపీడికీ పాల్పడ్డ వ్యక్తులు గుంటూరు మిర్చియార్డు వద్ద కారులో సెల్‌ఫోన్‌ వదిలి వెళ్లారు. దర్యాప్తులో ఈ సెల్‌ ఫోన్‌ సమాచారమే కీలకం కానుంది.

 

సెల్‌ఫోన్‌ కాల్‌ రిజిస్టర్‌ తనిఖీ  చేసి పోలీసులు దర్యాప్తు ప్రాంభించారు. మొత్తం 8 పోలీసుల బృందాలు దోపిడీ దొంగల కోసం చుట్టు పక్కల  గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తులమీద, అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిపై పోలీసులుప్రత్యేక నిఘా ఉంచారు.

 

 దోపిడీ దొంగలు ఒక కారులో బంగారు నగలతో తాడేపల్లి -డోలాస్‌నగర్‌ మీదుగా పరారైనట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనం గత రాత్రి పదిగంటలపుడు జరిగింది. సుమారు 7 కిలోల బంగారు నగలతో దొంగలు పరారయ్యారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu