ప్రధాని మోడీ భార్యకి రోడ్డు ప్రమాదంలో గాయాలు

Published : Feb 07, 2018, 12:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ప్రధాని మోడీ భార్యకి రోడ్డు ప్రమాదంలో గాయాలు

సారాంశం

కారు ప్రమాదంలో జశోదాబేన్ కి గాయాలు

ప్రధాని నరేంద్రమోడీ భార్య జశోదాబేన్  రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. రాజస్థాన్‌లోని కోటా-చిత్తోర్‌ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు బోర్లా పడింది. ఈ ఘటనలో జశోదాబేన్ తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదంలో జశోదా తలకు గాయాలు కాగా..  ఆమెను చికిత్స నిమిత్తం చిత్తోరగఢ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జశోదా తన సోదరుడు అశోక్‌ మోదీతో కలిసి గుజరాత్‌ మెహసానా జిల్లాలోని ఉన్జా పట్టణంలో నివసిస్తున్నారు. ఆమెకు మెహసానా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu