సెల్యూట్... శఠగోపం

First Published Dec 8, 2016, 10:24 AM IST
Highlights
  • పెద్ద నోట్ల రద్దు తర్వాత ట్విటర్ లో స్పందించిన ప్రధాని
  • ప్రజలు ఇబ్బంది పడుతారని ముందే చెప్పానని వెల్లడి

 

గత నెల రోజుల నుంచి దేశ మంతా క్యూలోనే నిలబడింది.. పనులు మానుకొని సామాన్య జనం బ్యాంకుల ముందు, ఏటిఎంల దగ్గర నానా కష్టాలు పడ్డారు. కొందరు క్యూలోనే చనిపోయారు.పెద్ద నోట్లు రద్దై నెల రోజులు దాటినా పరిస్థితి మాత్రం మారలేదు.

 

దేశమంతా గగ్గోలు పెడుతుంటే.. పార్లమెంటు దద్దరిల్లుతుంటే ప్రధాని మాత్రం ఎట్టకేలకు ఇప్పుడు స్పందించారు. అది ట్విటర్లో...

 

క్యూలలో నిలబడుతున్న భారత ప్రజలకు సెల్యూట్ అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. ''అవినీతి, ఉగ్రవాదం, నల్లధనాలపై నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ యజ్ఞంలో మనస్ఫూర్తిగా పాల్గొంటున్న భారతీయులందరికీ సెల్యూట్ చేస్తున్నా. రైతులు, వ్యాపారులు, కూలీలు.. వీళ్లంతా మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలు. వీళ్లందరికీ ప్రభుత్వ నిర్ణయం వల్ల పలు ప్రయోజనాలుంటాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొంతకాలం పాటు ఇబ్బందులు ఉంటాయని నేను ఎప్పుడూ చెబుతున్నాను.’’ అని ట్విటర్ లో సానుభూతి వ్యక్తం చేశారు.

 

 కానీ, నోట్ల రద్దు తర్వాత ఈ సమస్యను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో.. ఎలాంటి చర్యలు చేపడుతుందో ఒక్క మాట కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం మోదీ చేయలేదు.

 

నోట్ల రద్దు సమస్యను అధిగమించే ఒక్క నిర్మాణాత్మక ప్రతిపాదన ఒక్కటి కూడా మోదీ నోటి వెంట రాలేదు.

 

సెల్యూట్ ల వల్ల ప్రజల కష్టాలు తీరవు...కాస్త చిల్లర దొరికితేనే తీరుతాయి.

click me!