నంద్యాల కోసం ఎన్జీవో లతో మంత్రి గంటా సమావేశం(బ్రేకింగ్)

Published : Aug 20, 2017, 11:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
నంద్యాల కోసం ఎన్జీవో లతో మంత్రి గంటా సమావేశం(బ్రేకింగ్)

సారాంశం

ఎన్జీవోల ఓట్ల కోసం  మంత్రుల తాపత్రయం

పైకి తెలుగుదేశం పార్టీ గెలుస్తంది, చూడాల్సిందంతా మెజారిటీ ఎంత అని ఉపన్యాసాలిస్తున్నా, తెలుగుదేశం పార్టీ మాత్రం లోలోన చాలా టెన్షన్ తో ఉంది. అందుకే నంద్యాలలోని ఎన్జీవో నేతలను మచ్చిక చేసుకునే బాధ్యత మంత్రిగంటా శ్రీనివాసరావుకు అప్పగించారు. ఈ రోజు ఆయన , రాజ్య సభ ఎంపి టిజి వెంకటేశ్ తో ఎన్జీవోలతో ఓట్ల మంతానాలాడారు.నంద్యాల‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో మంత్రి గంటా శ్రీనివాస‌రావు , ఎంపి టిజి వెంక‌టేష్ చాలా సేపు సమావేశమయ్యారు.

ఈ సమావేశం ఒక  ప్రైవేట్ హోట‌ల్ లో జరిగింది.ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు కూడా  ప్రోద్బలంతో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఎన్జీవోలంతా తెలుగుదేశం అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని  మంత్రి గంటా కోరారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu