అబ్దుల్ కలాం స్మారక మండప్నాన్ని ప్రారంభించిన మోదీ

Published : Jul 27, 2017, 12:12 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
అబ్దుల్ కలాం స్మారక మండప్నాన్ని ప్రారంభించిన మోదీ

సారాంశం

కలాం సమాధి వద్దే స్మారక మండపం స్మారక మండపంలో 700 కలాం ఛాయా చిత్రాలు

రామేశ్వరంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన అబ్దుల్‌ కలాం స్మారక మండపాన్ని ఈరోజు  ప్రధాని  నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలోని తంగచ్చిమఠం ప్రాంతంలో  ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధి వద్ద   రూ.15 కోట్ల వ్యయంతో  కేంద్ర ప్రభుత్వం స్మారక మండపాన్ని నిర్మించింది. దాదాపు 700 కలాం ఛాయాచిత్రాలు, ఆయన సేవలపై గీసిన చిత్ర లేఖనాలు వంటివి ఇందులో ఏర్పాటు చేశారు. కలాం రెండో వర్ధంతి సందర్భంగా  గురువారం ఈ స్మారక మండపాన్ని నరేంద్రమోదీ  ప్రారంభించారు.
 ముందుగా జాతీయ జెండాను ఎగుర వేసిన మోదీ.. అనంతరం కలాం స్మారక మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్ర పతి అభ్యర్థి వెంకయ్యనాయుుడు, కేంద్ర మంత్రులు రాధాకృష్ణణ్, నిర్మలా సీతారామన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పలుువురు రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఈ సందర్భంగా కలాంకి నివాళులర్పించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !