
భారత మార్కెట్ లోకి మరో బడ్జెట్ ఫోన్ అడుగుపెట్టింది. ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మైక్రో మ్యాక్స్ ఈ ఫోన్ ని విడుదల చేసింది. యూ యూనిక్ 2 పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ కేవలం రూ.5,999కే అందజేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేసుకోవచ్చు.
యూ యూనిక్ 2 ఫోన్ ఫీచర్లు
5 అంగుళాల తాకే తెర
1.3గిగా హెడ్జ్ హార్డ్ కోర్ ప్రాసెసర్
5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా
13 మెగా పిక్సెల్ రేర్ కెమేరా
ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్
16జీబీ స్టోరేజ్ సామర్థ్యం
2500ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం