
భర్త మరణవార్తను బ్రేకింగ్ న్యూస్ గా చదవి వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్న చత్తీస్ఘడ్ టీవీ యాంకర్ గురించి మనకు తెలిసిందే. వృత్తి పట్ల తనుకున్న అంకితభావాన్ని దేశమంతా కీర్తించింది.
అయితే అందరూ యాంకర్లు అలా ఉండరు కదా... మచ్చుకు ఈ యాంకరమ్మను చూడండి. సీరియస్ గా వార్తలు చదవాల్సిన తరుణంలో ఇలా గోర్లు గిల్లుకుంటూ పనిపట్ల తనకున్న నిబద్దతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈమెది మనదేశ కాదులెండి. ఆస్ట్రేలియాలోని ఏబీసీ 24 న్యూస్ చానెళ్లలో యాంకర్ గా పనిచేస్తుంది.