లోకాయుక్త  ఉత్తర్వులకే దిక్కు లేదిక్కడ...

First Published Nov 2, 2017, 12:51 PM IST
Highlights
  •  ప్రజోపయోగం కోసం కేటాయించాల్సిన 10 శాతం స్థలం కోసం కాలనీ వాసుల వీరోచిత పోరాటం
  • రియల్టర్ కు  వ్యతిరేకంగా లోకాయుక్త ఇచ్చిన తీర్పును మేడ్చల్ జిల్లా యంత్రాంగం అమలుచేయలేకపోతున్నది

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలం, చౌదరిగూడ గ్రామ పంచాయతీ  పరిధిలోని సర్వే నెంబర్లు 854 & 855 లలో షుమారు 16 ఎకరాలలో ఉన్న "శేషాద్రి ఎంక్లేవ్" కాలనీలో సుమారు 200కు పైగా ఇళ్ళు ఉన్నాయి. ఈ కాలనీని నిర్మించిన "శ్రీ హర్ష కన్ స్ట్రక్షన్స్" ప్రజా ఉపయోగార్థం పార్కులు, ఆట స్థలాలు అంటూ 10% ఓపెన్ స్థలాలను లే అవుట్ లో చూపినా,  గ్రామ పంచాయతీకి బదలాయించలేదు. దీని మీద అధికారులందరికీ ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోవడంతో, కాలనీవాసుల తరఫున తిరుమల్ ప్రసాద్ పాటిల్  మార్చి 15, 2014 వ తేదీన జిల్లా పంచాయతీ అధికారిపైన, చౌదరిగూడ పంచాయతీ సెక్రెటరీ  పైనా లోకాయుక్త కోర్ట్ లో కేసు వేశారు.  దాదాపు మూడేళ్ల తర్వాత,15 వాయిదాల సుదీర్ఘ విచారణ అనంతరం, ఏప్రిల్ 10, 2017 వ తేదీన లోకాయుక్త కోర్టు తీర్పు ఇస్తూ 10% ఓపెన్ స్థలాలను బిల్డర్ నుండి పంచాయతీ  స్వాధీనపరచుకుని, కాలనీ ప్రజల ఉపయోగార్థం వినియోగించవలసినదిగా ఆదేశించింది. ఈ ప్రక్రియను మూడునెలల్లోగా పూర్తిచేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ , మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారిని ఉత్తర్వులిచ్చింది.  

 

దీనిమీద ఎవరూ చర్యతీసుకోలేదు. దీనితో  26-మే-2017 వ తేదీన నేను జిల్లా కలెక్టర్  ఒక అప్పీల్ చేస్తూ పాటిల్ లేఖ రాశారు. ఆపైన కోర్టు ఆదేశాల ప్రకారం, 10% ఓపెన్ స్థలాలను బిల్డర్ నుండి సేకరించి, పంచాయతీ పేరిట రిజిస్టర్ డీడ్ చేయించి, కాలనీవాసుల కోసం వినియోగించేలా ఏర్పాటుచేసి, తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు జూలై 01, 2017 వ తేదీన  కలెక్టర్ చౌదరిగూడ గ్రామ మంచాయతీ సెక్రెటరీకి ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఎటువంటి స్పందనా లేకపోవడంతో మరొకసారి ఆగష్టు 30, 2017 వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు , జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేస్తూ, కోర్టు ఆదేశాలను తక్షణమే అమలుపరచాలని  గ్రామ పంచాయతీ సెక్రెటరీ ని ఆదేశించవలసినదిగా కోరారు. దాంతో, హుటాహుటిన, పంచాయతీ సెక్రెటరీ సెప్టెంబర్ 09-2017 వ తేదీన, బిల్డర్ కు నోటీసులు అందించి, వారంలోగా 10% ఓపన్ స్థలాలను పంచాయతీకి స్వాధీనం చేయాలని చెప్పారు. అయితే, దాదాపు నెలరోజులైనా ఏమీ జరగలేదు. అక్టోబర్ 03-2017న మరొక సారి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు జిల్లా పంచాయతీ అధికారికి   ఫిర్యాదు చేసి, కోర్టు ఆదేశాలను తక్షణమే అమలుపరచవలసినదిగా కోరారు. కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం వహిస్తూ, కాలనీకి అన్యాయం చేస్తున్న  పంచాయతీ సెక్రెటరీ పై చర్యలు చేపట్టవాలని కోరారు. ఈ మధ్య కాలంలో జిల్లా పంచాయతీ  అధికారికి  పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విన్నవించడం కూడా జరిగింది. డి‌పి‌ఓ  సానుకూలాంగా స్పందిస్తూ, స్వయంగా కల్పించుకొని కోర్టు ఆదేశాలను అమలుపరచాలని  పంచాయతీ సెక్రెటరీ ఆదేశించినా, పంచాయతీ సెక్రెటరీ లెక్కచేయడం లేదు. ఫలితంగా మరోమారు అక్టోబర్ 12, 2017 వ తేదీన డి‌పి‌ఓని వ్యక్తిగతంగా కలిసి పరిస్థితి వివరించారు. ఆయన పంచాయతీ సెక్రెటరీకి ఫోన్ చేసి, కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు పరచడం లేదని ప్రశ్నించారు.  “బిల్డర్ కు నోటీసులు ఇచ్చాం, వారినుండి ఎటువంటి స్పందనా లేదు. బిల్డర్ పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ కు లేఖ రాశాం” అని పంచాయతీ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. కాలనీలో బిల్డర్ సంబంధిత ఓపెన్ స్థలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, వాటన్నిటిలోనూ ప్రభుత్వ  బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు.

ఇదీ పోరాట చరిత్ర

1.శేషాద్రి ఎన్ క్లేవ్ కాలనీ (సర్వే నెంబర్ 854/ఏ, 854/బీ, 855) పార్క్ వంటి అవసరాలకోసం బిల్లర్ లేఅవుట్ లో చూపించిన  10 శాతం  స్థలం కాలనీవాసులకు అందించలేదు.

2. మొట్టమొదటి సారిగా 2014, మార్చి 15న లోకాయుక్త కేసు వేశారు

3. ఆ స్థలాన్ని ప్రజల అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాలని 2017 ఏప్రిల్ 10వ తేదీన లోక్ యుక్త ఆదేశాలు జారీ చేసింది.

4. లోకాయుక్త తీర్పు అమలు కోసం పిటిషనర్ తిరుమల ప్రసాద్ పాటిల్ జిల్లా కలెక్టర్ ని కలిశారు.

5. లోకాయుక్త ఆర్డర్లను అమలుచేయాలని జులై 1వ తేదీన కలెక్టర్ అధికారులకు సూచించారు.

6.  కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను గ్రామ పంచాయితీ సెక్రటరీ ఖాతరు చేయలేదు. పిటిషర్ ఆగస్టు నెలలోమళ్లీ కలెక్టర్ కి అపీల్ చేసుకున్నారు.

7. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ.. పిటిషనర్ అక్టోబర్ లో కలెక్టర్ కి, సంబంధిత అధికారులకు మరోసారి అపీల్ చేసుకున్నారు.

 

కాలనీమొత్తం తిరిగాక, ఉన్న ఓపెన్ స్థలాలనన్నిటినీ లేఔట్ లో నోట్ చేసుకొని, మొత్తం 12 బోర్డులు ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఎటువంటి చర్యలూ చేపట్టకపోయేసరికి, అక్టోబర్ 20, 2017 వ తేదీన పంచాయతీ సెక్రెటరీ ఆరాతీస్తే, “అసలు పంచాయతీ దగ్గర డబ్బులే లేకపోతే, ఇక మీకు బోర్డులు ఎక్కడనుండి పెట్టాలి” అంటూ  లెక్కలేనివిధంగా సమాధానం ఇచ్చారు. డి‌పి‌ఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డి‌పి‌ఓ పంచాయతీ కార్యాలయానికి వచ్చి, తక్షణమే బోర్డులను ఏర్పాటు చేయవలసినదిగా పంచాయతీ సెక్రెటరీని ఆదేశించి వెళ్ళారు. అంతకుముందు గుర్తించిన 12 స్థలాలలో కేవలం 5 వాటిలో మాత్రమే బోర్డులు పెట్టి, మిగతావాటిలో ఇంతవరకూ పెట్టలేదు. అయితే కాలనీ వాసులుకోరుతున్న దేమిటి? కోర్టు ఆదేశం ప్రకారం ఆలస్యానికి తావు లేకుండా 10% ఓపెన్ స్థలాలను పంచాయతీ పేరిట గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయించి, ఆ స్థలాలను మా కాలనీవాసుల కోసం పార ఉపయోగార్థం వినియోగించితీరాలి.

మూడేళ్లపాటు కోర్టులో జరిగిన సుధీర్ఘ విచారణానంతరం, తెచ్చుకున్న తీర్పును జిల్లా యంత్రాంగమ అమలుచేయలేకపోతున్నదంటే లోకాయుక్త తీర్పు గురించి ప్రజలలో ఎలాంటి చులకన భావం ఏర్పడుతుందో వేరేచెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల్ వంటి విద్యావంతుడు, ఆర్థిక స్తోమత్తు వున్నవాడు మాత్రమే ఇంత ఓపికగా జిల్లా కార్యాలయాలచుట్టూ తిరిగి, పట్టువదలని  విక్రమార్కుడిలా పోరాడగలడు. అయినా లోకాయుక్త ఉతర్వులు అమలవుతాయన్న నమ్మకం కాలనీ వాసుల్లో కలగడం లేదు. ఇక సాధారణ పౌరులకు, చదవు లేని పల్లెటూరి ప్రజలకు,ఒక్క సారి కూడా జిల్లా కలెక్టర్ ను కలవలేని ఆశక్తులకు న్యాయం జరిగేదెలా?

click me!