జగన్ పాదయాత్ర ఖర్చు ఎవరు భరిస్తున్నారో తెలుసా?

First Published Oct 13, 2017, 3:17 PM IST
Highlights

ఎవరిమీద భారం వేసేది లేదని జగన్ భరోసా... అయినా ముందుకు వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 వ తేదీ నుంచి 3000 కి.మీ పాదయాత్ర కు బయలు దేరుతున్న సంగతి తెలిసిందే.

ఈ యాత్ర లో ఆయన వెంబడి అనేక మంది పార్టీ నేతలు, వందలాది మంది కార్యకర్తులు, వాహనాలు బయలు దేరతాయి. వీరందరికి వసతి భోజనాలు సమకూర్చాలి. వాహనాలు అందించాలి. ఇలా ఆరు నెలల పాటు ఈ ఖర్చంతా భరించాలి.

ఎవరు భరించాలి?

పార్టీ అధికారంలో లేదు. ప్రజాప్రతినిధులకు రాబడి లేదు. అంతా పోవుడే తప్ప రాబడి లేదు. ఈ విషయం జగన్ గ్రహించారు. ఈ ఖర్చు తమ మీద పడుతుందేమో నని చాలా మంది ఎమ్మెల్యేలు , ఎంపిల ఆందోళన చెందుతున్నారన్న విషయం జగన్ చెవిన పడింది. వారికి భరోసా ఇచ్చేందుకు ఎవరి మీద ఈ ఖర్చ వేసేది లేదు, ‘నేనే ఖర్చు భరిస్తాను,’ అని హామీ ఇచ్చారని తెలిసింది.

అయితే, ఈ ఖర్చంతా కూడా జగన్ ఒక్కడిమీదే పడటం బాగుండదని చిత్తుూరు జిల్లా పార్టీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భావించారు. ఆయనముందుకు వచ్చి పాదయాత్ర మొత్తం ఖర్చను తాను, తనకు మారుడు రాజంపేట ఎంపి ఇద్దరం కలసి భరిస్తామని తమ నేతకు చెప్పారట. అంటే, యాత్ర రెండోతేదీనమొదలయినప్పటినుంచి చివరి దాకా మంది మార్బలానికి భోజనాలు, వసతి తో పాటు వాహనాల ఖర్చు కూడా ఆయనే భరిస్తారన్నమాట.

దీనితో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇలాంటపుడు నాయకుడికి అండగా ఉన్నవాళ్లకే ముందు ముందు గుర్తింపు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి యాత్రకు సహాకారం  అందించిన వారందరికి  2004 లో ఆయన అధికారంలోకి వచ్చాక చాలా మేలు చేశారు. కొొందరికి రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు.

2012లో చంద్రబాబు  పాదయాత్ర చేసినపుడు ఖర్చును గరికపాటి రామ్మోహన్ రావు భరించాడని చెబుతారు. అందుకే ఆయన రాజ్యసభ టికెట్ లభించింది.

 

click me!