
తెలుగు రాష్ట్రాలలో నారాయణ, చైతన్యకళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రమవుతూ ఉండటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. రాష్ట్రమావనవనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సమావేశానికిఅధ్యక్షత వహిస్తారు. సమావేవం అక్టోబర్ 16 న జరుగుతున్నది. ఈ రోజు విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి భార్గవ రెడ్డి ఆత్మహత్య ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కడప జిల్లా రాయచోటికి చెందిన భార్గవరెడ్డి ఈ ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులలో అత్యధికులు ఈ రెండు కాలేజీలకు చెందిన వారే. భార్గవరెడ్డి ఆత్మహత్య మీద స్పందిస్తూ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు వుంటాయని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఘటనపై ప్రాథమిక వివరాలు తెలుసుకొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సంఘటన మీద విచారణ జరపాలని ఇంటర్మీడియట్ కమీషనర్ ను విచారణకు ఆదేశించారు.
విద్యార్థుల ఆత్మహత్య ఘటనల నివారణకు 16న జరుపుతున్న సమావేశానికి హాజరుకావాలని కార్పొరేట్ కళాశాలన్నింటికి ఆదేశాలు జారీచేశారు.
చక్రపాణి కమిటీ ద్విసభ్య సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. కార్పోరేట్ కళాశాలల్లో ఆత్మహత్య ఘటనలు తరచూ జరుగుతుండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశానికి హాజరుకాని కళాశాలమీద చర్యలుంటాయని, గుర్తింపు రద్దు చేసేందుకు వెనకాడమని మంత్రి గంటా హెచ్చరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్రింద క్లిక్ చేయండి