తెలంగాణా నిరుద్యోగ యువత మీద కన్నేసిన పవన్

First Published Mar 15, 2017, 7:53 AM IST
Highlights

 తెలంగాణా విద్యార్థులు,నిరుద్యోగులు జనసేనానితో  కదం తొక్కి  సాగుతారా?

 తెలంగాణా  విద్యార్థుల్లో, నిరుద్యోగ యువకుల్లో రగులుతున్న అసంతృప్తిని తెలంగాణాలో పవన్ కాలుమోపాలనుకుంటున్నారు.

 

ఉన్నట్లుండి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాలలో పోటీచేస్తానని  ప్రకటించడానికి వెనక ఈ వ్యూహం ఉందని జనసేకు చెందిన ఆంధ్రా నాయకుడొకరు  ఏసియా నెట్ కు తెలిపారు. పవన్ మీటింగ్ లకు అనుమతులొస్తాయా అనే అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశారు.

 

గతంలో తెలంగాణా రాజకీయాల గురించి  ఏ కామెంట్ చేసినా టిఆర్ ఎస్ నాయకులు ఆయనను ఆంద్రోడికి ఇక్కడేం పని అంటూ కొరకొర చూసే వాళ్లు,  కసురుకునే వాళ్లు. దీనితో ఆయన కొద్ది నిగ్రహమే పాటించారనాలి. తెలంగాణా వైపు కన్నెత్తి చూడలేదు. చాలా కాలం తెలంగాణా గురించి మాట్లాడలేదు, తెలంగాణాలో సమావేశం ఏర్పాటు విషయం  ప్రస్తావనకే తీసుకురాలేదు. ఇపుడు ఏకంగా తెలంగాణాలో కూడా పోటీ చేస్తాననడం సీరియస్  హోం వర్క్ జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణా నాయకత్వం నుంచి ఎదరయ్యే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిధ్దమయ్యాడట...

 

 తొందర్లోనే ఆయన టిఆర్ ఎస్  ప్రభుత్వం మీద తన స్టాండేదో  చెప్పబోతున్నాడు.  ఏలిన వారికి చికాకు కల్గించబోతున్నాడు. దీనికి రంగం సిద్ధమవుతూ ఉందని, తెలంగాణా మీద ఒక  ప్రశ్నా పత్రం తయారవుతూ ఉందని  సమాచారం. ఆయన ప్రధానం లక్ష్యం  తెలంగాణా విద్యార్థులను, ఉద్యోగాలకు కోసం  ఎదరుచూస్తున్న నిరుద్యోగులను జనసేన వైపు తిప్పుకోవడమేనని తెలిసింది.

 

ప్రయివేటురంగుంలో ఉద్యోగాలు రావడం లేదని, ప్రభుత్వ రంగంలో ఖాళీలెన్నో చెప్పడం లేదు, నియామకాల క్యాలెండర్ ప్రకటించడలేదని ఈ ప్రాంత యువకుల్లో నిరాశ ఉన్న సంగతి తెలిసిందే.  ఇపుడు టిజాక్  ఈ అంశం చుట్టూ యవజన సమీకరణ చేస్తూ ఉంది.  పవన్ తన సహజ శైలిలో తెలంగాణా యువకులను ఉద్దేశించి మాట్లాడితే  ఎలాంటి కలకలం వస్తుందో చూడాలి.

 

కాంగ్రెస్ మాజీ విప్  తూర్పు జయప్రకాశ్ రెడ్డికి  (జగ్గారెడ్డి) తో పవన్ కల్యాణ్కు మంచి స్నేహమే ఉంది. 2017 జనవరిలో సంగారెడ్డి సమీపంలో కాటమరాయుడు షూటింగ్ సమయంలో ఇద్దరు మంతనాలాడారు. ఇపుడు పవన్ కల్యాన్ తదుపరి మీటింగ్ తెలంగాణలో అందునా సంగారెడ్డిలో ఏర్పాటుచేయాలనుకుంటున్నందున జగ్గారెడ్డి ఏ దిశలో చూస్తున్నాడో అర్థమవుతుంది. జగ్గారెడ్డి కి టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ మీద ఎప్పటినుంచో కోపం ఉంది.అయితే, తలపడే శక్తి సమకూర్చులేకపోయాడు. బిజెపి లో చేరాడు, అదేమంత ఉపయోగపడలేదు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. తెలంగాణా ఇచ్చినా కాంగ్రెస్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఫలితంగా ఆయన ఏమీ చేయలేక పోతున్నాడు.

 

జగ్గారెడ్డికి స్థానికంగా మంచి పలుకుబడి ఉందనిచెబుతారు. అక్కడ ఉన్న యువకులతో ఆయనొక పెద్ద సైన్యమే తయారుచేసుకున్నాడు. అల్లాటప్ప లీడరేం కాదు, లోకల్ గాబాగా పట్టు ఉన్నవాడు.

 

పవన్ తెలంగాణా మీటింగ్ ఆంధ్రలో జరిగినంత సజావుగా, శాంతియుతంగా జరుగుతుందనుకోలేం. ఎందుకంటే, పవనంటే కెసిఆర్ కుఎలాంటి అభిప్రాయవుందో అందరికే ఎరికే... ఆయనపేరు కూడా కెసిఆర్ ఉచ్చరించకుండా,.. వాడెవరయ్యా సినిమా యాక్టర్ అని సభలో  ఉన్న వాళ్లనడిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి ఎత్తిపొడుపు మాటలకి, ఆంధ్ర బ్రాండేయడానికి   బెదిరిపోరాదని పవన్ నిర్ణయిచుకున్నట్లే లేక్క. తెగించినట్లే లెక్క.

 


 

 

click me!