
బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. గత నాలుగువారాలుగా పసిడి ధర నేలచూపులు చూస్తోంది.
ఈ రోజు పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర రూ.28,900 వద్ద స్థిరపడింది.
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.40,800కు చేరింది. నిన్నటితో పోల్చితే రూ. 180 ధర తగ్గింది.
అభరణాల తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి.