
ఉద్దానం బాధితులను ఆదుకోవాలని తాను చేసిన అప్పీల్‌కు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు ఉద్దానం సందర్శించి అక్కడి కిడ్నీ జబ్బుల మీద పరిశోధన చేసిన హార్వర్డ్ వైద్య బృందంతో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సెక్రెటేరియట్ లో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్ధానం సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి చేతులు కలపేందుకు సంస్థిద్దత వ్యక్తం చేశారు.
తాను ప్రభుత్వం తో కలిసి పనిచేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఉద్దానం సమస్య కారణంగా అనాధలు అవుతున్న చిన్నారులను దత్తత తీసుకోవడానికి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు.
దీనికి ముఖ్యమంత్రివెంటనే స్పదించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ చిన్నారుల పూర్తి బాగోగులను చూసుకుంటుందని హామీ ఇచ్చారు.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచశ్రేణి కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాన్ని ఉద్ధానంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీయం చంద్రబాబు పేర్కొన్నారు. రు 15 కోట్ల నిధులతో ఐసిఎం ఆర్ తో కలసి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు.
కిడ్నీ సమస్యపై అంతర్జాతీయస్థాయి సదస్సును నిర్వహించి ప్రపంచశ్రేణి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని యోచిస్తున్నామని కూడా ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి చెప్పిన మరిన్ని విశేషాలు:
*ఏ వ్యాధికైనా సరైన కారణాలు కనిపిస్తాయి, కానీ ఉద్ధానం కిడ్నీ సమస్యకు నిశితమైన కారణాలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి, పరిశోధన చేసినవారందరూ పలు రకాల కారణాలు చెబుతున్నారు
*వ్యాధి నివారణ, ముందు జాగ్రత్త చర్యలతో పూర్తిగా వ్యాధి నియంత్రణ చేపట్టడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.
*కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి నిధుల కొరత రానివ్వం ఈ సమస్య పరిష్కారానికి ఏవిధంగానూ రాజీ పడే సమస్య లేదు
*హార్వర్డ్ విశ్వవిద్యాలయం తరుఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఏవిధంగా సహకరించగలరో ప్రతిపాదనలతో రండి.
*ఉద్దానం పరిసర ప్రాంతాలలో వైద్య పరమైన కోర్సులు చేసిన 900 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారిని ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కార కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేయాలని సూచించిన పవన్ కల్యాణ్. స్పందించిన సీయం. వారి వివరాలు సేకరించి ఏవిధంగా భాగస్వాముల్ని చేయాలో పరిశీలించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశాలు