విశాఖ భూకుంభకోణంలో బాబు కొత్త నాటకం

First Published Aug 10, 2017, 12:55 PM IST
Highlights
  • దర్యాప్తు కోసం అధికారికంగా ఒక టీమ్ ను నియమించాక,అది సరిగ్గా పనిచేస్తున్నదో లేదో ప్రజాభిప్రాయం సేకరించవచ్చా?
  • పైకి ప్రజాస్వామికంగా కనిపిస్తున్నా, లోన  ఏదో నాటకం నడస్తున్నట్లనిపించదూ?

భూమికోసం అని పూర్వం ఒక నాటకం తెలుగునాట సంచలనం సృష్టించింది. ప్రఖ్యాత దర్శకుడు కెబిజి తిలక్ దాన్ని సినిమా గా తీశారు. జమిందారు కాజేసిన భూమిని దక్కించుకోవడానికి ప్రజలు తిరుగుబాటు నాటకం. జమిందారు కొడుకే తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తారు. (జయప్రద మొదటి సినిమా కూడ అదే. ఇది ఇక్కడ ఆప్రస్తుతం.)

అయితే, తెలుగుదేశం ప్రభుత్వం కాజేసిన భూములు కాపాడుకునేందుకు ‘విశాఖ’ నాటకమాడుతూ ఉంది. ఇది బాగా రక్తి కడుతూ ఉంది. కొన్ని వేల ఎకరాల భూముల రికార్డులు  మాయమయ్యాని విశాఖ కలెక్టర్ ఆ మధ్య చటుక్కున నోరుజారాడు.మంత్రి అయ్యన్న పాత్రడు రెచ్చిపోయి, ఒకమంత్రి భూ భకాసురుడన్నాడు, ఆయన వల్లే ఇదంతా జరుగుతూ ఉందన్నాడు. బిజెపి నేత విష్ణుకుమార్ రాజు కూడా ఒక రాయేశారు. ఇక ప్రతిపక్షం సరేసరి. ఉద్యమించింది.

 ఇంత గొడవ జరగుడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఉపముఖ్యమంత్రి  కెయి కృష్ణమూర్తి(రెవిన్యూ మంత్రి)తో పబ్లిక్ హియరింగ్ అన్నారు. తేదీలు కూడా ఇచ్చారు. ఏమనుకున్నారో ఏమో మనసుమార్చుకున్నారు.  ప్రతిపక్షమోళ్లు చొరబడి ఫిర్యాదులతో పబ్లిక్ హియరింగ్ ను హైజాక్ చేసుకుపోతారని భయపడ్డారా? దానికి తోడు వైజాగ్ లో  పౌర ఉద్యమం చాలా బలంగా ఉంది. అక్కడ ఇ ఎఎస్ శర్మ అనే పెద్దాయన కూడా ఉన్నాడు. మాజీ ఐ ఎఎస్ ఆఫీసరయిన  ఆయన కూడా వచ్చి ఈ రూలూ, ఈ రూలు చూపించి, మ్యాపులు బయట పెట్టి నానాయాగీ చేస్తే ఇబ్బందని బెదిరిపోయారా? మొత్తానికి  ఆ కొట్టు మూసేశారు. దీనికి జవాబంటూ,  ఏకంగా సిట్ (స్పెషల్ ఇన్వెష్టిగేషన్)వేస్తున్నామని ప్రకటించారు. సిట్ అంటేనే అనుమానాలొస్తాయి. వచ్చాయి.  కేస్ తుస్సుని మొకం చిట్టించారు. దానితో తెలుగుదేశం పార్టీ విశాఖ భూముల కోసం నాటకానికి ఇపుడు ఇంకొం అంకం జోడించింది.  ఇది కామెడీ ట్రాక్. అసలు విషయమేటంటే, చంద్రబాబు నాయుడు ప్రతిదాని మీద సర్వే చేయించినట్లు,  సిట్ మీద సర్వే అనే శారు. సిట్ ఎలా పనిచేస్తుందో ప్రజాభిప్రాయం కూడా  సేకరించమని రాజభటులను పురమయించాడు. వారు విశాఖ  వెళ్లి జనాభిప్రాయం సేకరించారు. వివరాలను రాజుగారి  సలహాదారు, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు.

విశాఖ భూకుంభకోణం మీద సిట్ వేయాలనుకున్న ప్రభుత్వం నిర్ణయం, సిట్ పనితీరు బాగు బాగు అని 75 శాతం మంది ప్రశసించారట. 17 శాతం మంది బాగా లేదుపొమ్మన్నారట. మిగతా వాళ్లంతా ‘అబ్బేమాకేమీ తెలీదండి’ అని తప్పుకున్నారట. భూ  కబ్జాలో  రాజకీయనేతల మీదే అనుమనాలున్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారట. ఈ రాజకీయనాయలకులేపార్టీ వారో చెప్పలేదు. అది సర్వే పరిధిలో లేదేమో.ఒక కుంభకోణం మీద లోతయిన దర్యాప్తుకు ఒక సిట్ వేసి, దాని పనితీరు  గురించి రోడ్ల మీద ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటి? ప్రజాభి ప్రాయం వ్యతిరేకంగా ఉంటే సిట్ ను మూసేస్తారా?

 

click me!