తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం

Published : Dec 05, 2016, 08:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం

సారాంశం

అర్థ రాత్రి గం.1.24ని.కు ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ పన్నీర్ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ విద్యాసాగర్ రావు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతితో ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. అర్థ రాత్రి 1.30కు పన్నీర్ చేత గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం చేయించారు. అమ్మకు విధేయిడిగా, గతంలో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి విధేయుడిగా పేరుతెచ్చుకున్న పన్నీర్... ఇప్పుడు అమ్మ మృతితో సీఎంగా ప్రమాణం చేశారు.

పన్నీర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జయలలిత మృతికి ఏఐఏడీఎంకే శాసనసభా పక్షం రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం పన్నీర్ సెల్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ... జయలలిత మృతి తీరని లోటన్నారు. తాను తమిళనాడు గవర్నర్ గా ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో జయ సాదరంగా స్వాగతించిన విషయాన్ని ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు గుర్తు చేసుకున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !