‘అమ్మ’ 10 వ తరగతిలో స్టేట్ ఫస్ట్

Published : Dec 05, 2016, 07:36 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
‘అమ్మ’ 10 వ తరగతిలో స్టేట్ ఫస్ట్

సారాంశం

అడుగుపెట్టిన ప్రతిరంగంలో ‘జయ’కేతనం

 

దేశ రాజకీయ యవనికపై ‘అమ్మ’ ఓ చెరగని ముద్ర వేసిపోయారు. ద్రవిడనాట నుంచి యావత్తు దేశాన్ని తన వైపు తిప్పుకున్న అసాధారణ ప్రజ్ఝ ఆమెది.

 

అనుకున్నరంగంలో అత్యున్నత శిఖరాలకు చేరడం ఆమెకు బాల్యం నుంచే వెన్నెతో పెట్టిన విద్య.

 

ఎందుకంటే 3 ఏళ్ల వయసులోనే భారతనాట్యంతో మెప్పించిన జయ చదువులోనూ రాణించారు.

 

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మ పదవ తరగతిలో తమిళనాడు రాష్ట్రంలో ఫస్టు ర్యాంకర్.

కేవలం 13 ఏళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు.

 

జయలలిత మొదటి లాయర్ అవ్వాలనుకున్నారు.

 

ది ఎపిస్టల్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా జయలలిత నటించారు.

 

అమ్మ నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపై కూడా ఒక చిత్రంలో సీఎం గా మెరిశారు.  1992లో విడుదలైన నీన్గా నల్లా ఇరుకనుమ్ అనే తమిళ చిత్రంలో జయ ముఖ్యమంత్రి పాత్రను పోషించడం విశేషం.

 

1961 నుంచి 1980 మధ్య 118 సూపర్ హిట్ సినిమాలలో నటించిన జయ దేశంలోనే ఆ సమయంలో అత్యధిక పారితోషకం తీసుకున్న నటిగా గుర్తింపు పొందారు.

 

వివిధ భాషల్లో నటించిన తొలి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్లే.

 

తెలుగులో తొలి చిత్రం మనుషులు మమతలు, వెన్నిర ఆదై ( తమిళ్), జీసెస్ ( మలయాళం), ఇజ్జత్ ( హిందీ) సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

 

శివాజీ గణేషన్ తో జయ నటించిన తొలి చిత్రం దేవియ మగన్ ను  భారత ప్రభుత్వం ప్రాంతీయ భాషా చిత్రం కేటగిరిలో  అస్కార్ అవార్డు కు దేశం తరఫున నామినేట్ చేసింది.

 

అమ్మ.. తెలుగులో నటించిన తొలి చిత్రం మనుషులు మమతలు హీరో అక్కినేని నాగేశ్వరరావు.. అలాగే జయ నటించిన చివరి తెలుగు చిత్రం హీరో కూడా ఆయన కావడం గమనార్హం.

 

తెలుగులో ఆమె మొత్తంగా 28 సినిమాల్లో నటిస్తే అన్ని సిల్వర్ జూబ్లీ హిట్లే కావడం ఇప్పటికీ ఒక రికార్డు.

 

జయలలిత తమిళనాట నటిగా, సీఎం గా ద్రవిడ ఆరాధ్య దైవ్యంగా నిలిచినా.. ఆమె చిత్రరంగ ప్రవేశం మాత్రం కన్నడంలో జరిగింది. అమ్మ మొదటి చిత్రం చిన్నద గొంబె... 15 ఏళ్ల కే ఆ చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా జయ పరిచయమ్యారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !