‘పల్లె’ కాలేజీ విద్యార్థులు ఎంత పనిచేసారో తెలుసా?

Published : Oct 24, 2017, 04:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
‘పల్లె’ కాలేజీ విద్యార్థులు ఎంత పనిచేసారో తెలుసా?

సారాంశం

పట్టుమని ఇరవై ఏళ్లు కూడా రాలేదు.. కానీ మోసాల్లో ఆరితేరిపోయారు. ప్రజలను లక్ష్యంగా చేసుకొని వారికి దొంగనోట్లను అంటకడుతూ.. గత కొంతకాలంగా మోసాలకు పాల్పడ్డారు.

చక్కగా కాలేజీకి వెళ్లి.. చదువుకోవాల్సిన ముగ్గరు కుర్రాళ్లు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. పట్టుమని ఇరవై ఏళ్లు కూడా రాలేదు.. కానీ మోసాల్లో ఆరితేరిపోయారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని వారికి దొంగనోట్లను అంటకడుతూ.. గత కొంతకాలంగా మోసాలకు పాల్పడ్డారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. అనంతరం పురం జిల్లాలో దొంగనోట్ల కలకలం సంచలనం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే డిప్లామా కాలేజీలో చదివే ముగ్గురు కుర్రాళ్లు.. దొంగనోట్ల చలామణి చేస్తూ పోలీసులకు చిక్కారు. గత కొంతకాలంగా రూ.2వేల నోట్లని కలర్ జిరాక్స్ తీసి హిందూపురం, కర్ణాటక సరిహద్దుల్లోని అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా అనంతపురంలోని మారుతీనగర్ లో ప్రత్యేకంగా ఒక గదిని కూడా తీసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి వారి గదిపై దాడి చేశారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కలర్ జిరాక్స్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు.   

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !