పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం వెనక్కి

First Published Dec 27, 2016, 1:59 PM IST
Highlights

రూ. 5 వేల నోటును రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పాకిస్తాన్.

అబ్బో ఎంత ఆశ... మనదగ్గర అనుకుంటున్నారా ఏమిటి.... అదేం కాదు... మన పక్క దేశం పాకిస్తాన్ లో...

 

భారత్ లో నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పాక్ కూడా దేశంలోని పెద్ద నోటు అయిన రూ. 5 వేల నోటును రద్దు చేయాలని నిర్ణయించింది.

 

 

దీనిపై పార్లమెంట్‌ ఎగువ సభ సిఫారసు కూడా చేసింది. రూ. 5 వేల నోటును రద్దు చేయడం వల్ల బ్లాక్ మనీ వెలికితీయవచ్చని, దేశం క్యాష్ లెస్ గా మారుతుందని  తీర్మానంలో పేర్కొంది.

 

 అయితే పాక్‌ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై ఆమోదముద్ర వేయలేదు.

 

పెద్ద నోట్లను రద్దుచేస్తే సంక్షోభం ఏర్పడుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేయడం, భారత్ లో పరిణామాలను పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది.

click me!