ఇండియాలో అనందం తక్కువే... నివేదిక

First Published Mar 20, 2017, 11:05 AM IST
Highlights

వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్-2017 విడుదలయింది.  భారత్ 122 వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 80 వ మెట్టు మీద ఉంది. నార్వే  నెంబర్ వన్ , భూతల స్వర్గమే.

 

 

ఇండియాలో  ప్రజలు ఏమంత అనందంగా లేరు. ఆ మాట కొస్తే పాకిస్తాన్ లోనే బాగున్నారు.

 

ఈ రోజు విడుదల చేసిన ప్రపంచ ఆనంద సూచిక (వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్ ) మీద భారత దేశం 122 స్థానంలో  ఉండిపోయింది.  పాకిస్తాన్ మాత్రం భారత కంటే చాలా పైన 80 స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి సహాయం తీసుకుని కొంత మంది వివిధ రంగాల నిపుణులు(Sustainable Development Solutions Network)  ఈ నివేదిక ను తయారు చేస్తారు. మొదటి నివేదిక 2012 లో వచ్చింది.  బాగా ప్రాశస్త్యం వచ్చింది. 

 

ఎంతగా ఈ నివేదిక పాపులర్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో హ్యాపినెస్ ఇండెక్స్ పెంచేందుకు కృషిచేస్తానని  ప్రకటించారు. అయితే చాలా మంది దానిని సీరియస్ గా తీసుకోలేదు అది వేరే విషయం.  ఈ నివేదికలు రావడం మొదలయ్యాక , ఒక సొసైటీ లేదా దేశం నిజంగా ప్రగతి చెందిందనేందుకు ఈ ఇండెక్స్ నే కొలబద్దగా తీసుకోవడం మొదలుపెట్టారు. దేశాలకే కాదు, పౌరుల ఆనందానికి కూడా ఎలాంటి సామాజిక పునాదులు పడ్డాయనే అంశానికి ఈ నివేదిక ప్రాముఖ్యం  ఇస్తుంది.పనికి మాలిన డిజిపి గ్రోత్ లెక్కలు చప్పి చప్పట్లు కొట్టించుకోవడానికి ఇది పనికి రాదు. అనందానికి జిడిపికి సంబంధమే లేదు. తలసరి జిడిపి, సగటు జీవిత కాలం,  ప్రభుత్వం నుంచి పౌరులకు అందే మద్దతు, అవినీతి గురించి ప్రజలేమనుకుంటున్నారు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇండెక్స్ లెక్క కడతారు.

 

ఈ సారి,ప్రజలెక్కువ అనందంగా ఉండే అగ్రశ్రేణి  దేశాలలో  నార్వే (1), డెన్మార్స్ (2) ఐస్ లాండ్ (3), స్విజర్లాండ్ (4) ఫిన్లండ్ (5), నెదర్లాండ్స్ ( 6), కెనడా( 7), న్యూజిలాండ్ (8), ఆస్ట్రేలియా (9), స్వీడెన్ (10) ఉన్నాయి. అమెరికా 14 వ స్థానంలో ఉంటే రష్యా 49 వ స్థానంలోఉంది. పాకిస్తాన్ 80వ స్థానంలో ఉంటే భారత దేశం 122 వ స్థానంలోఉంది. చిత్రమేమంటే కజఖ్ స్తాన్(60), పెరు(63),టర్కీ(69), వెనెజులా( 82) వంటి దేశాలు కూడా భారత్ కంటే హ్యాపీ గా ఉన్నాయి.

click me!