16 ఏళ్ల ముస్లిం గాయనికి 42 ఫత్వాలు

Published : Mar 15, 2017, 11:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
16 ఏళ్ల ముస్లిం గాయనికి 42 ఫత్వాలు

సారాంశం

16 ఏళ్ల ముస్లిం గాయనిని ఇకపై పాటలు పాడొద్దని మతపెద్దలు 42 ఫత్వాలు జారీ చేశారు.  

మతచాంధసవాదానికి మరో యువగాయని గళం మూగబోయే పరిస్థితి దాపురించింది.

 

తన మధురగళంతో దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘ ఇండియన్ ఐడల్’ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన ఓ 16 ఏళ్ల ముస్లిం గాయనికి చేదు అనుభవం ఎదురైంది.

 

అస్సోంకు చెందిన యువ స్టార్‌ గాయని నహిద్‌ అఫ్రిన్‌ ఇప్పుడు బాలీవుడ్ లోనూ మంచి గాయనికి పేరు తెచ్చుకుంటుంది. సోనాక్షి సిన్హా నటించిన 'అకిరా' సినిమాలో ఓ పాటతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

 

అయితే ఆమె పాడటం ఇస్లామిక్‌ మతగురువులకు నచ్చలేదనుకుంటా. ఆమె ఈ నెల 25న గువాహటిలో నిర్వహించే ఓ మ్యూజిక్ షోలో పాడబోతోంది. అయితే, ఆ ప్రోగ్రాం మసీదుకు, శ్మశానానికి దగ్గరగా ఉందని, కాబట్టి ఆమె ఆ ప్రోగ్రాంలో పాడొద్దని మతగురువులు ఫత్వా జారీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 మత సంస్థల నుంచి ఆమెకు ఫత్వాలు జారీ అయ్యాయి.

 

అయితే ఈ విషయాన్ని అఫ్రిన్ లైట్ గానే తీసుకుంది. ఫత్వా నన్ను షాక్ కు గురిచేసింది. అయితే ఇలాంటి వాటికి నేను బెదరను. సంగీతాన్ని వీడేది లేదు అని స్పష్టం చేసింది.

మరోవైపు ఫత్వా ఎదుర్కొంటున్న ఆమెకు పూర్తిస్థాయిలో భద్రత కలిస్తామని అసోం ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !