హిందువుల సంఖ్య తేల్చనున్న పాక్ సెన్సస్

First Published Mar 13, 2017, 8:32 AM IST
Highlights

 పాకిస్తాన్  లో హిందువులెంతమంది? తొందర్లో లెక్క తేలనుంది

పాకిస్తాన్ లో  హిందువులు, క్రైస్తవుల వంటి మతపరమయినమైనారిటీలు ఎంత మంది ఉన్నారో కనుగొనేందుకు  సెన్సస్  నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ లో  ఈ మధ్య కాలంలో   జనాభా లెక్కించలేదు. 19 సంవత్సరాల కిందట ఒక సారి జనాభాను లెక్కించారు. ఇదే మళ్లీ జరగడం.

 

ఈ సారి ప్రధానంగా  హిందవులు, క్రైస్తవులు ఎంతమంది దేశంలో ఉన్నారో కచ్చితంగా లెక్క తేలుతుందని చెబుతున్నారు. దేశంలో ఇరవై లక్షల నుంచి కోటి మంది దాకా క్రైస్తవులు,  25 లక్షల నుంచి 45 లక్షలమంది దాకా హిందువులున్నారని అంచనా. ఈ సంఖ్యకు ఆదారమేమీ లేదు. అందువల్ల ఇప్పటి సెన్సస్ తో ఈ సమస్య పరిష్కారమవుతుంది.  జనాభా లెక్కల్లో ప్రజలు తమ మతమేదో వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, దేశంలో 70కి పైగా భాషలున్నా,  ఈ సెన్సస్ లో కేవలం  తొమ్మిది భాషలకు మాత్రమే  గుర్తించాల్సి ఉంటుంది. ఇలా తొలగించిన మైనారిటీ భాషలలో గుజరాతీ కూడా ఉంది.

 

పాకిస్తానీ సెన్సస్ మరొక విశేషం ట్రాన్స జెండర్ కు గుర్తింపు నీయడం. మగవారికి (1) మహిళలకు (2) సంఖ్య కేటాయించి, ట్రాన్స్ జండర్కి మూడు (3) కేటాయించారు. పాకిస్తాన్ థర్డ్ సెక్స్ ని సెన్సస్ లో చేర్చడం ఇదే ప్రథమం.

click me!