పాకిస్తాన్ లో అంతే మరి..

Published : Dec 19, 2016, 12:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పాకిస్తాన్ లో అంతే మరి..

సారాంశం

విమానం ఎగరడానికి మేకను బలిచ్చారు పాకిస్తాన్ ఏయిర్ లైన్స్ అధికారుల దారుణం రన్ వే పై మేక తలనరికిన అధికారులు

 

విమానం ఎగరాలంటే ఎక్కడైన ఇంధనం అవసరం.. అదే పాకిస్తాన్ లో అయితే ఓ మేకను బలిస్తే సరిపోతుంది!

 

వాళ్ల నమ్మకాలు అలాంటివి మరి. రన్ వే నుంచి  విమానం టేకాఫ్ చేయడానికి పాక్ ఏయిర్ లైన్స్ సిబ్బంది ఓ మూగ జీవాన్ని బలిచ్చారు.

 

 

ఇస్లామాబాద్‌ విమానాశ్రయంలో ఏటీఆర్‌-42 విమానం టేకాఫ్‌ సందర్భంగా పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) సిబ్బంది మేకను బలిచ్చి దారుణానికి ఒడిగట్టారు.

 

 

అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

 

డిసెంబర్‌ 7న పాక్‌లో ఏటీఆర్‌ విమానం కూలి 47 మంది చనిపోయారు. దీంతో ఈ రకం విమానాలను అక్కడ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అనంతరం వాటికి మళ్లీ పరీక్షలు నిర్వహించారు.

 

 

తర్వాత ఆదివారం మొదటిసారి ఏటీఆర్‌ విమాన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మళ్లీ విమానానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని విమాన సిబ్బంది మేకను బలి ఇచ్చారు.

 

 

అయితే దీనిపై విమాన సంస్థ వివరణ ఇస్తూ మేకను బలి ఇచ్చిన విషయం తమది కాదని, సిబ్బంది వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu