క్యాష్ లేదని సిగ్గు పడవద్దు...

First Published Dec 19, 2016, 8:25 AM IST
Highlights

క్యాష్ లెస్  ఇపుడు రెడ్ ఏరియాలోకి కూడా ప్రవేశిస్తున్నది

నగదు వ్యాపారమే తప్ప అప్పులు, కార్డులు చెల్లని రెడ్ లైట్ ఏరియాలో కూడా ఇపుడు క్యాష్ లెస్ వ్యాపారం మొదలయింది.  

 

ఈ  విషయం  మీద గత వారం ఎసియా నెట్ ఒక కథనం అందించింది. నోట్లకు వేశ్యవాడల్లో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అనుకున్నదాని కంటే ఆనందం ఎక్కవ పొందిన ‘ అతిధి’ నోట్లను పడక మీదున్న సుందరి మీదకు విసిరేసే సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇపుడు ఈ సరదాల మీద నోట్ల రద్దు దెబ్బ పడింది.

 

జేబు నిండా నోట్లేసుకుని రెడ్‌లైట్ ఏరియాల చొరబడి  సుఖాల  తలుపులు తట్టే రసికులు కరవయ్యారని వార్తలు వొచ్చిన సంగతి తెలిసిందే.  రోజూ వేయి నుంచి పదిహేను వందల దాకా వ్యాపారం జరిగేది. నోట్ల రద్దు తర్వాత వ్యాపారం పడిపోయింది. దీనితో మేం పిల్లల స్కూలు ఫీ కూడా కట్టలేకపోయామని ఒక వేశ్య చెప్పింది.

 

దీంతో వేశ్యలు కూడా క్యాష్ లెస్ కు మారాల్సిన పరిస్థితి వచ్చింది.  ఫలితంగా నాగ్‌పూర్ లోని గంగాజమునా రెడ్‌లైట్ ఏరియాలో ‘‘పేటి ఎం  చెల్లింపులు స్వకరిస్తాం’’ అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు.   అంతా ఆండ్రాయిడ్ ఫోన్లను పట్టుకుని స్వాగతం పలుకుతున్నారు.


 పేటిఎం ఏజంట్లు కూడా ఈ ఏరియాలో  ప్రచారం మొదలుపెట్టారు.ఇందులో చాలా మందికి  బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులు లేవు.  ఇపుడు ఈ ఏజంట్లు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నారట. 


ఇపుడు బతకాలంటే క్యాష్ లెస్ కు మారాలి లేదా వృత్తి మారాలి.  ఇంతకాలం గుట్టుగా బతికిన వాళ్లనిపుడు క్యాష్ లెస్ వ్యాపారంతో బజారున పడుతున్నారు.

click me!