
నూరేళ్ల పండగ జరుపుకుంటున్న హైదరబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాకెక్కింది. ఈ జాబితాలో ఉస్మానియాకు 23వ ర్యాంకును లభించింది. ఉద్యమాలతో గాయపడినా ఉస్మానియా మెరుగు తగ్గడంలేదు. ఎందకంటే, గతంలో ఈ విశ్వవిద్యాలయం 33 స్థానంలో ఉండింది.
వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగనున్న 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఉస్మానియా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియాలోని అత్యుత్తమ వర్సిటీల జాబితాలో గతనెలలో ఓయూ కు చోటు దక్కింది.
ఒకసర్వేద్వారా ఈ ర్యాంకింగ్ లు ఇచ్చారు. 3300 సంస్థలు ర్యాంకింగ్ కోసం పోటీ పడ్డాయి. మొదటినివేదిక 2016లో వచ్చింది. ఇది రెండోది.
పనితీరునుబట్టి దేశంలోని వివిధ ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ఇచ్చారు.
వాటిని కేం ద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదలచేశారు.
ఇంజినీరింగ్ విద్యాసంస్థల విభాగంలో హైదరాబాద్ ఐఐటీ పదో స్థానం లో, వరంగల్‌లోని ఎన్‌ఐటీ 34వ స్థానంలో, హైదరాబాద్ జేఎన్టీయూ 63వ స్థానంలో, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 75వ స్థానంలో నిలబడ్డాయి.
. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ హోదా బాగా పడిపోయింది. గత సంవత్సరం నాలుగో స్థానంలో ఉన్న హెచ్ సి యు ఈసారి ఏడో స్థానానికి పడిపోయింది.
ఇక దేశ వ్యాపితంగా చూస్తే,ఢిలీ మిరాండ్ హౌస్, బెంగుళూరు ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఉత్తమ కాలేజీ, ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలబడ్డాయి.
ఎన్ని వివాదాలు ఎదురొన్కా ఢిల్లీలోని జెఎన్ యు నెంబర్ టూ గా నిలబడితే, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మూడో స్థానంలో ఉంది.