రెండోందల నోట్లొస్తున్నాయ్

First Published Apr 4, 2017, 6:17 AM IST
Highlights

ఈ ఏడాది జూన్ నుంచి ముద్రణ

చిల్లర కష్టాలతో సతమతమవుతున్న దేశానికి వూరట కల్గించేందుకు రెండు వందల రూపాయల నోట్లను ముద్రించాలన్న ప్రతిపాదనకు రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది. జూన్ నుంచి ఈ నోట్ల ముద్రణ మొదలవుతుందను కుంటున్నారు.

 

నిజానికి మార్చిలో జరిగిన ఆర్ బిఐ బోర్డు మీటింగ్ లోనే ఈ కొత్త నోట్ల ముద్రణకు ఆమోదం లభించింది.

 

కేంద్రం ప్రభుత్వం ఆమోదం కూడా లభించాల్సి ఉండటంతో ఇది బయటకు పొక్క లేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే, నోటు రంగు, సెక్యూరిటీ లక్షణాలు, ప్రింటింగ్ ఖరారుచేయడం జరుగుతుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే రిజర్వ్ బ్యాంకు  ఈనోట్ల ముద్రణకు పూనుకుంటుందని బ్యాంకు వర్గాలు పత్రికలకు తెలిపాయి.

 

ప్రభుత్వం ఇప్పటికే వేయి రుపాయలనోట్ ను కూడ  విడుదల చేయాలనుకుంటున్నది. చిల్లర నోట్ల అవసరం వల్ల దాని కంటే రెండొందల నోటు ను విడుదలచేయాలనే దానికే ప్రాముఖ్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. నోట్ల రద్దు తర్వాత ఛలామణి లోకి వస్తున్న రెండో పేద్దనోటు ఇదే. ఇంతకు ముందు రెండు వేల నోట్ల ను విడుదలచేసిన సంగతి తెలిసిందే.  వాటిని రద్దు చేస్తారనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ రెండొందల నోటుతో రెండువేల నోట్ల ఎగిరిపోతుందని కూడా అనుకున్నారు. అలాంటి దేమీద లేదు రెండు నోట్లు కలసి జీవిస్తాయి.

click me!