జగన్ పాదయాత్రను అడ్డుకోండి

Published : Nov 01, 2017, 04:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
జగన్ పాదయాత్రను అడ్డుకోండి

సారాంశం

ఏపీ సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం పలు అంశాలపై చర్చించిన చంద్రబాబు

జగన్ పాదయాత్రను అడ్డుకోండి. ఈ మాటలను చెప్పింది మరెవరో కాదు.. సీఎం చంద్రబాబు నాయుడు. బుధవారం అమరావతిలోని సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ షమావేశంలో చంద్రబాబు  మంత్రులతో పోలవరం ప్రాజెక్టు, ఫాతిమ కళాశాల విద్యార్థుల సమస్య, గండికోట పనుల్లో జాప్యం, జగన్ ఫాదయాత్ర , ఇంటింటికీ తెలుగు దేశం తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో జగన్ పాదయాత్రను అడ్డుకోవాల్సిదిగా చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు సమాచారం.  ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు వచ్చాయని.. జరిగిన పనులకు సంబంధించి ఇంకా రూ.3వేల కోట్లు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్ని జిల్లాల్లో సమగ్ర నీటి నిర్వహణకు చేపడుతున్న చర్యల గురించి సీఎం వివరించారు. ప్రభుత్వ చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్య న్యాయపరమైనదని, విద్యార్థులకు ఎలాగైనా న్యాయం చేయాలి అన్నారు.. విద్యార్థులకు అన్యాయం చేసిన కళాశాలను విడిచిపెట్టేది లేదని.. ఆస్తులు స్వాధీనం చేసుకునైనా విద్యార్థులకు న్యాయం చేద్దామన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !