ప్రాణాలు తీసిన ప్రభుత్వ పింఛను

First Published Mar 30, 2018, 6:13 PM IST
Highlights
ఎల్లారెడ్డి జిల్లాలో దారుణం

ప్రభుత్వం ఇచ్చే వృద్దాప్య పెన్షన్ కోసం వెళల్ిన ఓ వృద్దురాలు మృతిచెందిన సంఘటన ఎల్లారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. పింఛన్ కోసం పోస్టాపీస్ వద్ద ఎండలో పడిగాపులు కాసిన వృద్దురాలు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. 

ప్రభుత్వం ఇచ్చే పింఛను వృద్దులకు ఆసరాగా నిలుస్తూ వారి  అవనరాలను తీరుస్తున్న విసయం తెలిసిందే. కానీ     అదే  పించను డబ్బులకోసం ఓ వృద్ద మహిళ మరణించింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి జిల్లాలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన ఎరుకల బక్కవ్వ (75) వృద్ధాప్య పింఛన్‌ కోసం గురువారం ఉదయం గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లింది. అయితే  ఈమెలాగే చాలామంది పింఛను కోసం పోస్టాపీస్ కు వచ్చారు. దీంతో  ఉదయం వెళ్లిన బక్కవ్వ మధ్యాహ్నం 2గంటల వరకు మండుటెండలో పింఛన్‌ కోసం పడిగాపులు కాసింది.  చివరకు పింఛను డబ్బులు చేతికందడంతో ఆనందంగా ఇంటికి వెళ్లింది. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎండలో ఎక్కువసేపు ఉండటంతో ఇంటికి వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసింది. 

అయితే బక్కవ్వ మృతికి పింఛన్‌ పంపిణీదారుడు చంద్రమౌళి నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆయన గతంలోకూడా ఈ విధంగానే విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  
 

click me!