బ్యాల్ ట్యాంపరింగ్ ఘటనలో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ సారీ చెప్పాడు. ఇవాళ సిడ్నీలో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ ఘటనతో తాను కుదేలైనట్లు చెప్పాడు. జట్టు సభ్యులకు, క్రికెట్ అభిమానులకు, నిరుత్సాహ పడ్డ ఆస్ట్రేలియన్లకు, అందరికీ సారీ అని స్మిత్ మీడియా సమావేశంలో బోరున విలపించాడు. కేప్‌టౌన్‌లో జరిగిన ట్యాంపరింగ్ ఘటనపై పూర్తి బాధత్య తానే తీసుకుంటున్నట్లు చెప్పాడు.
పరిస్థితి అంచనా వేయడంలో విఫలమయ్యానని, దాని పర్యవసానాలను అర్థం చేసుకుంటున్నానని అన్నాడు. ఇది నాయకత్వ విఫలమని, తాను నాయకుడిగా విఫలమైనట్లు స్మిత్ చెప్పాడు. తన తప్పు ఇతరులకు ఓ గుణపాఠంగా మారుతుందన్నాడు. తన తప్పు వల్ల మార్పు జరుగుతుందని ఆశిస్తున్నానన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లితండ్రులను చూడడం ఇబ్బందికరంగా ఉందన్నాడు. తన టీమ్ వల్ల ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం జరిగిందని.. అందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు.