తండ్రి పొగిడాడు.. తనయుడు గాలితీశాడు ( video)

Published : Mar 30, 2017, 12:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
తండ్రి పొగిడాడు.. తనయుడు గాలితీశాడు ( video)

సారాంశం

నచ్చని సినిమాను నచ్చలేదని ఇప్పుడు బహిరంగంగా చెప్పే పరిస్థితి టాలీవుడ్ లో లేనే లేదు. నాకు నీ సినిమా నచ్చలేదని హీరో తో చెబితే లైట్ తీసుకుంటే తీసుకోవచ్చునేమో కానీ ఆయన అభిమానులు మాత్రం తీసుకోరు.

అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు. కొందరికీ గొప్పగా అనిపించే సినిమాలు మరికొందరికి అసలు నచ్చనే నచ్చవు.

 

కానీ, నచ్చని సినిమాను నచ్చలేదని ఇప్పుడు బహిరంగంగా చెప్పే పరిస్థితి టాలీవుడ్ లో లేనే లేదు. నాకు నీ సినిమా నచ్చలేదని హీరో తో చెబితే లైట్ తీసుకుంటే తీసుకోవచ్చునేమో కానీ ఆయన అభిమానులు మాత్రం తీసుకోరు. ఉతికి ఆరేస్తారు. వీపు విమానం మోత మోగిస్తారు.

 

ఇప్పుడింతా ఎందుకంటే ..

 

మొన్న జరిగిన ఇఫా వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాంశు కూడా వచ్చాడు. అక్కడ ఓ యాంకర్ రీసెంట్ గా ఏం సినిమా చూశావని హిమాంశును అడిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడి సినిమా చూశానని, అది యావరేజ్ గా ఉందని హిమాంశు కుండబద్దలు కొట్టాడు.

అయితే అంతకుముందు హిమాంశు నాన్న మంత్రి కేటీఆర్ కూడా కాటమరాయుడు సినిమా చూశారు. దానిపై తన అభిప్రాయాన్ని ట్విటర్ లో వ్యక్తం చేశారు. పవన్ సినిమాలో అద్భుతంగా చేశారని, సినిమా బాగుందని ప్రశంసించారు.

 

ఇలా తండ్రి కాటమరాయుడిని ఆకాశానికి ఎత్తితే తనయుడు మాత్రం పాతాళానికి తొక్కేశాడు.

 

పాపం.. లౌక్యం తెలియని పిల్లాడు మనసులో ఉంది బయటపెట్టాడు.

 

అయితే పవన్ ఫ్యాన్స్  ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో తెలియడం లేదు.

 

ఎందుకంటే గతంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ ఒకసారి పవన్ గురించి మాట్లాడమంటే చెప్పను బ్రదర్ అంటూ కాస్త సీరియస్ అయ్యారు.

 

దీంతో అల్లు అర్జున్ ను పవన్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. బన్నీ రీసెంట్ మూవీ ట్రైలర్ డీజే ను యూట్యూబ్ లో విడుదల చేస్తే డిస్ లైక్ లతో ఓ కొత్త చెత్త రికార్డును అల్లు అర్జున్ కు తగిలించారు. కాటమరాయుడి సినిమాకు ఓ టీవీ చానెళ్ 3 రేటింగ్ ఇస్తే స్టూడియోలో విధ్వంసం సృష్టించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !