నగరవాసులకు కరెన్సీ కష్టాలు..

First Published Aug 12, 2017, 2:23 PM IST
Highlights
  • 60 శాతానికి పైగా ఏటీఎంల్లో నో క్యాష్‌బోర్డులు
  • ఆందోళన చెందుతున్న ప్రజలు

 

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో నగరవాసులు కరెన్సీ కష్టాలు ఎదుర్కోనున్నారు. రెండో శనివారం, ఆదివారం, సోమవారం కృష్ణాష్టమి, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు నాలుగు రోజులు మూతపడనున్న సంగతి తెలిసిందే.

డీమానిటైజేషన్ తరువాత నగరంలో 40 శాతానికి పైగా ఏటీఎంలు దాదాపు మూతపడ్డాయి.. అక్కడక్కడ పనిచేస్తున్న ఏటీఎంల్లో సైతం నగదు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. శుక్రవారం రాత్రి నగరంలో 60 శాతానికి పైగా ఏటీఎంల్లో నో క్యాష్‌బోర్డులు కనిపించాయి.

క్యాష్ ఉన్న ఏటీఎంల ముందు నగదు కోసం ప్రజలు క్యూ కట్టారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత 70 శాతానికి పైగా ఖాతాదారులు నగదు కోసం బ్యాంకులకు వెళ్లేందుకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగు రోజుల బ్యాంకులకు సెలవు రావడంతో నగదు కష్టాలు ఎలా తీరతాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఏటీఎంల ముందు నోక్యాష్‌ బోర్డులు కనిపించడంతో నగదు కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు.

బ్యాంకులకు సెలవులున్నా ఏటీఎంలలో నగదు పెట్టేందుకు పలు బ్యాంకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయని ఓ బ్యాంకు ఉన్నతాధికారి తెలిపారు. కాగా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుతోంది. 

         ఓ వైపు బ్యాంకులకు వరుస సెలవులు...మరో వైపు ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తుండడంతో నగరవాసులు బేంబేలెత్తుతున్నారు. చేతిలో నగదు లేకుండా నాలుగు రోజులు గడపడం ఎలా అంటూ ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎంల్లో నగదు నిల్వలు లేకపోయినా.. ప్రభుత్వేతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో అక్కడక్కడ క్యాష్ లభించడం ప్రజలకు కాస్త ఊరట కలిగిస్తోంది.

 

click me!