మూడు రంగులద్దుకున్న నెక్లెస్ రోడ్

First Published Aug 12, 2017, 1:38 PM IST
Highlights
  • భాజపా నేతలు జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.
  • రెయిన్‌బో హోమ్స్‌ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్ లో ఈరోజు దేశభక్తి వెల్లివిరిసింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతల్లో దేశ భక్తి పెరిగినట్టే కనిపిస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ తమ భక్తిని చాటుకుంటూ వస్తున్నారు.  పంద్రాగస్టు వచ్చేసరికి అది మరీ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది.ఇందులో భాగంగానే ఈరోజు నెక్లెస్ రోడ్ లో భాజపా నేతలు జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.

మరో రెండు రోజుల్లో.. పంద్రాగస్టు వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు భాజపా నేతలు పీపుల్స్ ప్లాజా వద్ద ప్రదర్శన చేశారు. తిరంగ యాత్ర పేరిట వీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌,  భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మేల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, భాజపా కార్యకర్తులు తదితరులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా మరో వైపు స్వచ్ఛంద సంస్థ రెయిన్‌బో హోమ్స్‌ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్ నిర్వహించారు.బాలికలను సంరక్షించాలంటూ వారు ఈ కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు .. 70 మీటర్ల పొడువైన జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ రెయిన్‌బో హోమ్స్‌ సంస్థ చిన్నారుల విద్య కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. హైదరాబాద్‌ ఇంఛార్జ్‌ కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ  మరుగుదొడ్ల ఆవశ్యకత ను తెలియజేశారు.కాలకృత్యాలకు ఆరుబయటకు వెళ్లకుండా మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. రుబెల్లా వ్యాధి టీకాలను త్వరలో అన్ని విద్యాసంస్థలకు అందిస్తామని తెలిపారు.

click me!